పదివేలలో అతిసుందరుడా
మనోహరుడా మహిమోన్నతుడా (2)
నీ నామం అతి మధురం
నీ త్యాగం మహానీయం (2)
తల్లిదండ్రుల కన్నను
బంధు మిత్రుల కన్నను (2)
ప్రేమించి నాకై నిలచే
స్నేహితుడా ప్రాణ నాథుడా (2) ||పదివేలలో||
నీ కొరకే యేసు నీ కొరకే (3)
నా కరములెత్తెదను
మోకరించి నా శిరము వంచి
నా కరములెత్తెద నీ కొరకే (2)
పరిశుద్ధ ఆత్మ రమ్ము (2)
నను యేసు పాదము చెంత చేర్చుము
పరిశుద్ధ ఆత్మ రమ్ము ||నీ కొరకే||