Wednesday, 24 July 2024

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన
దీవెనలు కురిపించు వాన
పరిశుద్ధాత్మ వాన
ప్రభు వర్షించు నీ జీవితాన (2)
అది నూతన పరచును
ఫలియింపచేయును
సమృద్ధినిచ్చును
సంతోషపరచును (2) ||తొలకరి||

ఎడారి వంటి బ్రతుకును
సారముగా చేయును
జీవజలముతో నింపి
జీవింపచేయును (2)
ఆకు వాడక ఫలమిచ్చునట్లు
సమృద్ధితో నింపును (2) ||అది నూతన||

సత్యస్వరూపి శుద్ధాత్మా
నీలో వసియించును
పాప బ్రతుకు తొలగించి
నూతన జీవితమిచ్చును (2)
యేసుకొరకు నిజ సైనికునిగా
సజీవ సాక్షిగ నిలుపును (2) ||అది నూతన||

No comments:

Post a Comment

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...