Tuesday, 26 July 2016

54. Yehovanu Ganamu Chesedamu Ekamuga

యెహోవాను గానము చేసెదము ఏకముగా
మనకు రక్షకుడాయెను ఆయన మహిమ పాడెదము
ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు

యుద్ధశూరుడెహోవా - నా బలము నా గానము
నా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవా

ఫరో రధముల సేనలను - తన శ్రేష్ఠాధిపతులను
ఎర్రసముద్రములోన - ముంచివేసె నెహోవా

నీ మహిమాతిశయమున - కోపాగ్ని రగులజేసి
చెత్తవలె దహించెదవు - నీపై లేచు వారిని

దోపుడు సొమ్ము పంచుకొని - ఆశ తీర్చుకొందును
నాకత్తి దూసెదను - అని శత్రువనుకొనెను

వేల్పులలో నీ సముడెవడు - పరిశుద్ధ మహనీయుడా
అద్భుతమైన పూజ్యుడా - నీవిం వాడెవడు

ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా 
సముద్రము మధ్యను - ఆరిన నేలను నడచిరి

53. Yehova Satya Deva Ni Sarane Korithin

యెహోవా సత్యదేవా - నీ శరణే కోరితిన్
నీవెన్నడు నను విడనాడవని
నా రక్షణకర్త నీవేయని

నీవే ఆశ్రయ దుర్గమై - నా కోటవై నాధుడవై
మమ్ము కదలింప నీయవని - మాకు సహాయం నీవని

ఆకాశం కంటే నా ప్రభు - అతి ఉన్నతుడౌ నీవేయని
అన్ని కాలములలో నీకృప - నాకు అమూల్యమైనదని

నా యీజీవిత మంతయు - నిన్నే నేను నుతియింప
నన్ను నీవాడుకొందువని - నాకు సహాయం నీవని

52. Yuda Stuthi Gotrapu Simhama Yesayya Na

యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా
నీవేకదా నా ఆరాధనా - ఆరాధనా - స్తుతి ఆరాధనా

నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను అధముల జేసిన నీకు
అసాధ్యమైనది ఏమున్నది - అసాధ్యమైనది ఏమున్నది

నీ నీతి కిరణాలకై నా దిక్కు దెసలన్నీ నీవేనని
అనతి కాలాన ప్రధమ ఫలముగ పక్వపరచి నీకు
అసాధ్యమైనది ఏమున్నది - అసాధ్యమైనది ఏమున్నది

నీ వారసత్వముకై నా జయము కొరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు
అసాధ్యమైనది ఏమున్నది - అసాధ్యమైనది ఏమున్నది

51. Mruthulanu sajeevuluga leni vatini unnatugane

మృతులను సజీవులుగా లేనివాటిని ఉన్నట్టుగా
చేయుదేవుడా పిలుచుదేవుడా
నీకే స్తోత్రం స్తోత్రము నీకే స్తోత్రం స్తోత్రము 

ఆధారం లేనప్పుడు ఆధారివి నీవై
అబ్రహాముకు వారసునిగా ఇస్సాకును ఇచ్చితివి 
వాగ్ధానం చేయువాడవు నమ్మదగినవాడవు  
నమ్మదగిన వాడవు నా దేవుడవు
నీకే స్తోత్రం స్తోత్రము నీకే స్తోత్రం స్తోత్రము 

ఏ సహాయం లేనప్పుడు ఆ సహాయం నీవై
ఏలియాకు కాకుల ద్వారా ఆహారం నిచ్చితివే 
నా సాయం నీవై నా తోడుగ నిలిచితివి 
నా తోడువు నీవే నా దేవుడవు
నీకే స్తోత్రం స్తోత్రము నీకే స్తోత్రం స్తోత్రము 

Monday, 25 July 2016

50. Ma Sarvanidhi Nivayya

మా సర్వానిధి నీవయ్యా
నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా

మా రక్షకుడవు మా స్నేహితుడవు
పరిశుద్ధుడవు మా యేసయ్యా
పరిశుద్ధమైన నీ నామమునే
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా

నీవే మార్గము నీవే సత్యము
నీవే జీవము మా యేసయ్యా
జీవపు దాత శ్రీ యేసునాధ
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా

విరిగితివయ్యా నలిగితివయ్యా
కలువరిలో ఓ మా యేసయ్యా
విరిగి నలిగిన హృదయాలతో
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా

49. Mahima Nike Prabhu Ghanata Nike Prabhu

మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు
స్తుతులు చెల్లింతును త్రియేక దేవుని
నా త్రియేక దేవునికే

సిలువలో నా కొరకు యేసు రక్తము కార్చితివే
ప్రాణము పెట్టితివే యేసు ప్రేమను చూపితివే
నీ ప్రేమను చూపితివే

నా అతిక్రమము బట్టి యేసు గాయాలు పొందితివా
నీ గాయాలే నా స్వస్థత కేంద్రాలు నాకు స్వస్థత నీవైతివే
నన్ను స్వస్థపరచు యెహోవావే

ఆత్మతో నన్ను నింపు యేసు అగ్నితో నన్ను నింపు నీ
ఆత్మల పట్టుటకై (యేసు) నీ అభిషేకము నాకిమ్ము
అగ్ని అభిషేకము నా కిమ్ము

48. Mahaghanudu Mahonnathudu

మహాఘనుడు మహోన్నతుడు
సర్వశక్తుడు సర్వోన్నతుడు

యేసే నీకు ఆశ్రయము
ఆయన నీకు కోటయగును
దేవుడని నీవు నమ్ముకొనుము
ఆయన నీడలో విశ్రమించుము

వేటకాని ఉరి నుండి విడిపించును
వినాశనం రాకుండ నిన్ను కాయును
తన రెక్కలతో నిన్ను కప్పును
కేడెము మోయుచు నిన్ను కాయును

వెయ్యిమంది నీప్రక్క పడియుండగా
పదివేలు కుడిప్రక్క కూలి యుండగా
అపాయము నీకు సంభవింపదు
ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును

నీదు పాదములకు రాయి తగలదు
దూతలు చేతులతో ఎత్తుకొందురు
యేసు నామమెరిగి నీవు నిలువుము
యేసే నీకు ఘనత నిచ్చును

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...