Thursday, 4 August 2016

103. Athyunnatha Simhasanamupai Asinudavyna

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే (2)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్

ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం (2)            ||ఆహాహా||

కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు
నా రక్షణకర్త స్తోత్రం (2)                    ||ఆహాహా||

ఆమెన్ అనువాడా స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం (2)                 ||ఆహాహా||

మృత్యుంజయుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం (2)             ||ఆహాహా||



102. Halleluya Halleluya Halleluya Amen

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్
ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్

యెహోవా దేవ స్తోత్రం స్తోత్రం
యెహోవా యీరే స్తోత్రం స్తోత్రం
యెహోవా నిస్సీ స్తోత్రం స్తోత్రం
యెహోవా షమ్మా స్తోత్రం స్తోత్రం

పరిశుద్ధ ఆత్మ స్తోత్రం స్తోత్రం
కృపగల ఆత్మ స్తోత్రం స్తోత్రం
మహిమగల ఆత్మ స్తోత్రం స్తోత్రం
జ్ఞాన ఆత్మ స్తోత్రం స్తోత్రం

యేసుని వార్త జయం జయం
యేసుని నామం జయం జయం
యేసుని రక్తం జయం జయం
పునరుత్థానుడే జయం జయం

101. Halleluya Halleluya Stothramul

హల్లేలూయా హల్లేలూయా స్తోత్రముల్
రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానై యున్నవాడా
మహిమా మహిమా ఆ యేసుకే
మహిమా మహిమా మన యేసుకే

సూర్యునిలో చంద్రునిలో తారలలో
ఆకాశములో ||మహిమా||

కొండలలో లోయలలో జీవులలో
ఆ జలములలో ||మహిమా||

ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా
యుగయుగముల నిత్యుడా ||మహిమా||

ప్రేమస్వరూపుడా శాంతిస్వరూపుడా
కరుణామయుడవుగా ||మహిమా||

Wednesday, 3 August 2016

100. Halleluya Halleluya Halleluya Ma Prabhuvachi Yunnadu Halleluya

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
మా ప్రభు వచ్చియున్నాడు హల్లెలూయ

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
మా ప్రభు విక్కడున్నాడు హల్లెలూయ

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
మా ప్రభువు వచ్చుచున్నాడు హల్లెలూయ

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
మా కెప్పుడును క్రిస్మసె హల్లెలూయ

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
మా త్వరలోనే రేప్చర్ హల్లెలూయ

99. Halleluya Stuthi Mahima Ellappudu

హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము
ఆ... హల్లెలూయా. హల్లెలూయా.. హల్లెలూయా

 1. అలసైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము
        అల సంద్రములను దాించిన ప్రభువగు యెహొవాను  స్తుతించెదము

2. ఆకాశము నుండి మన్నాను పంపిన ఆ దేవుని స్తుతించెదము
        బండనుండి మధుర జలములు పంపిన ఆ యెహొవాను  స్తుతించెదము

Tuesday, 2 August 2016

98. Halleluya Yesu Prabhun Yellaru Stuthiyinchudi

1. హల్లెలూయ యేసు ప్రభున్‌ - యెల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను - తిలకించి స్తుతియించుడి
బలమైన పనిచేయు - బలవంతున్‌ స్తుతయించుడి
ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి
రాజుల రాజైన యేసురాజు - భూ జనుల నేలున్‌
హల్లెలూయ - హల్లెలూయ దేవుని స్తుతియించుడి

2. తంబురతోను వీణతోను - ప్రభువును స్తుతియించుడి
పాపమును రక్తముతో - తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాళములన్‌ - మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని - యేసుని స్తుతియించుడి

3. సూర్యచంద్రులార ఇల - దేవుని స్తుతియించుడి
హృదయమును మండించిన - యేసుని స్తుతియించుడి
అగ్నివడగండ్లార మీరు - కర్తను స్తుతియించుడి
హృదయమును చేధించిన - నాధుని స్తుతియించుడి

4. యువకులారా, పిల్లలారా - దేవుని స్తుతియించుడి
జీవితముల్‌ ప్రభుపనికై - సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా  ప్రభువులారా - యెహోవాను స్తుతియించుడి
ఆస్థులను యేసునికై - అర్పించి స్తుతియించుడి

5. అగాధమైన జలములారా - యెహోవాను స్తుతియించుడి
అలలవలె సేవకులు - లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా - దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు - ఎల్లరు స్తుతియించుడి 

97. Halleluya Pata Yesayya Pata

హల్లెలూయా పాట - యేసయ్య పాట
పాడాలి ప్రతిచోట - పాడాలి ప్రతినోట
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయా

1. కష్టాలెన్ని కల్గినా - కన్నీరులే మిగిలినా
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా
ప్రభు యేసునే వేడుమా

2. చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగించినా
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా
ప్రభు యేసునే వేడుమా

3. నీ తల్లి నిను మరిచినా - మరువడు నీ దేవుడు
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా
ప్రభు యేసునే వేడుమా

4. శోధనలు నిను చుట్టినా - సంతోషమే తట్టినా
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా
ప్రభు యేసునే వేడుమా

5. సింహాల కెరవేసినా - అగ్నిలో పడవేసినా
ధీరుడవై సాగుమా - ప్రభు సిల్వనే చాటుమా
ప్రభు సిల్వనే చాటుమా

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...