ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా ||2||
కెరూబులపై ఆసన్నుడా ||2||
సత్యసంపూర్ణుడా వందనమయ్య ||ఇశ్రా||
ఎల్షడాయ్ నీవే - బలవంతుడవు
నీయందు నేను సమస్తము చేయగలను ||2||
నా త్రోవకు వెలుగువు నీవే నా మార్గము గమ్యము నీవే
యెహోవా యీరే నా పోషకుడా
నా కొరకు నీవే బలియైతివా ||2||
నిత్యజీవము నాకొసగినావు - పరిశుద్ధులలో నను చేర్చినావు
యెహోవా రాఫా - నా స్వస్థత నీవే
నీ సిలువ రక్తమే - నా విజయ గీతం ||2||
రోగము శాపము తొలగించినావు - సాతానుపై జయమిచ్చినావు