కరుణామయుడా - కల్వరిగిరిలోన
నీవు చివరిగ చిందించిన రక్తం
చిట్ట చివరిగ రక్షించినది
నీకు అందుకే స్తోత్రములు
నీకు లెక్కలేని స్తోత్రములు
నిన్ను స్తుతించుటకు అర్హుడను కాను
నన్ను మన్నించుమో యేసయ్యా
నీ స్వరము అతి మధురం
నీ ప్రేమ మనోహారం
ఆశ్రయమే జీవం నీ వాక్యమే జీవితం ||నీకు||
నీ ద్రాక్షా వనములో నేను
ఏపాటి మొక్కనో
జీవితమే మార్చితివి నీ పొలములో చేర్చితివి ||నీకు||
ఏ కష్టములోనైనా ఏ దుఃఖములోనైన
నీవు నా తోడుగా నిలచితివి నను నీ దరి చేర్చితివి ||నీకు||