Thursday, 4 August 2016

114. Na Jivam Na Sarvam Nive Deva

నా జీవం నా సర్వం నీవే దేవా (2)
నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా      ||నా ||

తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే (2)
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2)    ||నా ||

నీవే నీవే నీవే దేవా (4)

113. Na Kannula Kanniru Thudichina Yesayyake Aradhana Aradhana

నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే
ఆరాధనా – ఆరాధనా

నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ||ఆరా||

తన వాక్యముతో నను కాల్చిన యేసయ్యకే ||ఆరా||

తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే ||ఆరా||

112. Na Aradhanaku Yogyuda Na Ashraya Durgamu Nive

నా ఆరాధనకు యోగ్యుడా...
నా ఆశ్రయ దుర్గము నీవే...
ప్రేమించువాడవు - పాలించువాడవు - కృపచూపువాడవు
నీవే... నీవే...
నీవే - నీవే - నీవే (అతి) పరిశుద్ధుడవు
నీకే - నీకే - నీకే నా ఆరాధనా ||2||

నీ ఘనతను దినమెల్ల వివరించెదనూ..
దానికెవ్వరూ - సాటిరారని...
బలమైన దేవుడా - సర్వశక్తిమంతుడా
నా ఆరాధనకు యోగ్యుడా... ||2||

కీర్తితోను ప్రభావ వర్ణనతోను
నా హృదయం - నిండియున్నది
ఓ విజయశీలుడా - పరిశుద్ధాత్ముడా
నా ఆరాధనకు యోగ్యుడా... ||2||

111. Daiva Mahima Nindiyunnadi

దైవ మహిమ నిండియున్నది
దైవ జనమా మనమారాధింతుము
దూతల సమూహంతో భూమి అదిరెన్
మన స్తుతులతో ఆకాశం తెరువబడెను

ఆహా మహిమ ఆరాధన గొప్ప సంతోష ఆరాధన
ఘనపరతుము పొగడెదము
పరవశమొందెదము హల్లెలూయ

భూనివాసులారా గంభీరంతో పాడుడి
ఆనంద ధ్వనితో ఆరాధన చేయుడి
ప్రభు దయాళుడు మహాకృప గలవాడు
తరతరములకు నిజ దైవం

నా ప్రాణమా ప్రభున్ సన్నుతించుమా
అంతరంగమా ప్రభు నామమున్ స్తుతించుమా
ప్రభు నీకు చేసిన ఉపకారముల్
మరువకు ఎన్నడు మరువకుము

మహిమ ఆరాధన ఆనందం ఆనందం
మహోన్నత దేవునికి ఘనత ఘనత
పరిశుద్ధ ఆత్మతో ఆరాధింతుము
పరలోక మహిమతో నిండుచున్నాము

110. Karunamayuda Kalvarigirlona Nivu Chivariga Chindinchina Raktham

కరుణామయుడా - కల్వరిగిరిలోన
నీవు చివరిగ చిందించిన రక్తం
చిట్ట చివరిగ రక్షించినది

నీకు అందుకే స్తోత్రములు
నీకు లెక్కలేని స్తోత్రములు
నిన్ను స్తుతించుటకు అర్హుడను కాను
నన్ను మన్నించుమో యేసయ్యా

నీ స్వరము అతి మధురం నీ ప్రేమ మనోహారం
ఆశ్రయమే జీవం నీ వాక్యమే జీవితం 
||నీకు||

నీ ద్రాక్షా వనములో నేను ఏపాటి మొక్కనో
జీవితమే మార్చితివి నీ పొలములో చేర్చితివి ||నీకు||

ఏ కష్టములోనైనా ఏ దుఃఖములోనైన
నీవు నా తోడుగా నిలచితివి నను నీ దరి చేర్చితివి ||నీకు||

109. Ethaina Kondapaina Ekanthamuga Cheri

ఎత్తయిన కొండపైన ఏకాంతముగ చేరి
రూపాంతర అనుభవము పొంద ప్రార్ధించుమో ప్రియుడా

క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము
సూర్యుని వలె ప్రకాశింప మోము వస్త్రము కాంతివలెను

పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతోమ్లాడుము
ప్రభువు తిరిగి మ్లాడు వరకు ప్రార్ధించి ధ్యానించుము

108. Israyelu Stothramupai Asinuda Kerubulapai

ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా ||2||
కెరూబులపై ఆసన్నుడా  ||2||
సత్యసంపూర్ణుడా వందనమయ్య ||ఇశ్రా||

ఎల్‌షడాయ్‌ నీవే - బలవంతుడవు 
నీయందు నేను సమస్తము చేయగలను ||2||
నా త్రోవకు వెలుగువు నీవే నా మార్గము గమ్యము నీవే

యెహోవా యీరే నా పోషకుడా
నా కొరకు నీవే బలియైతివా ||2||
నిత్యజీవము నాకొసగినావు - పరిశుద్ధులలో నను చేర్చినావు

యెహోవా రాఫా - నా స్వస్థత నీవే
నీ సిలువ రక్తమే - నా విజయ గీతం ||2||
రోగము శాపము తొలగించినావు - సాతానుపై జయమిచ్చినావు 

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...