Friday, 5 August 2016

121. Nive Na Pranamu Nive Na Sarvamu Nive Na Jeevamu Yesayya

నీవే నా ప్రాణము నీవే నా సర్వము
నీవే నా జీవము యేసయ్యా (2)
మరువలేను నీదు ప్రేమ
విడువలేనయ్యా నీ స్నేహం (3)        ||నీవే||

మార్గం నీవే సత్యం జీవం నీవే
జీవించుటకు ఆధారం నీవే (2)
బ్రతుకంతా నీ కొరకై జీవింతును
నిను నేను ఆరాధింతున్ (2)             ||నీవే||

తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నా తోడు ఉండె చెలిమి నీవే (2)
అపాయము రాకుండా కాపాడువాడవు
నిను నేను ఆరాధింతున్ (2)             ||నీవే||

Thursday, 4 August 2016

120. Nive Na Devudavu Aradinthunu

నీవే నా దేవుడవు ఆరాధింతును
నీవే నా రాజువు కీర్తించెదను
మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే
పరలోకము నుండి వెలుగుగ వచ్చి మార్గము చూపితివి
చీకటి నుండి వెలుగునకు నను నడిపించావు
హోసన్నా మహిమ నీకే
హోసన్నా ప్రభావము రాజునకు
నీవే... నీవే.. నీవే.. నీవే

119. Nivanti Varu Lerilalao Yesayya Nive Madu Rakshanakarthavu Yesayya

నీవంటి వారు లేరిలలో యేసయ్యా
నీవె మాదు రక్షణకర్తవు యేసయ్యా
నీ సిలువ శక్తిని ఆశ్రయింతుము యేసయ్యా
నీ పునరుత్థానమే నిత్యజీవము యేసయ్యా
ఆది సంభూతుడవు ఆద్యంత రహితుడవు ||2||
ఆకాశ మహా విశాలమునందున్న సర్వాధికారివి ||2||

మా పాప శాపములన్ని విమోచించితివి
మా రోగములకు స్వస్థత చేకూర్చితివి
పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా నిచ్చితివి
శక్తియు మహిమయు స్తోత్రములకు అర్హుడవు ||ఆది||

ప్రతివాని మోకాలు నీ నామమున వంగును
ప్రతివాని నాలుక యేసుప్రభువని ఒప్పుకొనును
పరలోకమందున్న భూమియందున్న వారిలో
పరలోకతండ్రి అధికముగా హెచ్చించును         ||ఆది||

నీదు సింహాసనం నిరంతరం నిలచునది
నీరాజదండం న్యాయార్ధమై ఏలునది
నీతిని ప్రేమించి దుర్ణీతి ద్వేషించువాడవు
నిత్యానంద తైలాభిషేకం నొందినావు                 ||ఆది||

118. Ni Prema Ni Sakthi Nimpumu Nalo

నీ ప్రేమ నీ శక్తి
నింపుము నాలో
నిను ఆరాధిస్తాను - హృదయమంతటితో
నిను ఆరాధిస్తాను - మనసంతటితో
నిను ఆరాధిస్తాను - బలమంతటితో
యేసు నీవే... నా రాజువు              ||2|| ||నీ ప్రేమ||

More Love
More Power
More of You in my Life
I will Worship You with all of My Hear
And I will Worship You with all of Mind
And I will Worship You with all of Strength
You are my Lord                      ||2|| ||More||

117. Ni Cheyi Chapi Nanu Nadipinchu Ni Swarmu Naku Ila Vinipinchu

నీ చేయి చాపి నను నడిపించు
నీ స్వరము నాకు ఇల వినిపించు ||2||
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే మార్గము జీవము నీవే రక్షణ కేడేము
నీవే నాకు నీడవై నాతో ఉండుము యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా ||నీ చేయి||

116. Ninne Preminthunu

నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును 
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును
నే వెనుదిరుగా...

నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా

నిన్నే సేవింతును నిన్నే సేవింతును 
నిన్నే సేవింతును నిన్నే సేవింతును
నే వెనుదిరుగా... ||నీ సన్నిధిలో||

నిన్నే పూజింతును నిన్నే పూజింతును
నిన్నే పూజింతును నిన్నే పూజింతును
నే వెనుదిరుగా...   ||నీ సన్నిధిలో||

నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్
నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్
నే వెనుదిరుగా...   ||నీ సన్నిధిలో||

115. Ninne Ninne Stutiyinthu Ninne Ninne Kirthinthu

నిన్నే నిన్నే స్తుతియింతు
నిన్నే నిన్నే కీర్తింతు
నిన్నే నిన్నే సేవింతు నా యేసయ్యా ||2||
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ||2||
పరిశుద్ధుడా నీకే ఆరాధనా
పరిశుద్ధుడా నీకే ఆరాధన ||2||

నా దీనస్థితి నుండి నన్ను లేవనెత్తావే
విలువైన నీ సేవ నాకిచ్చినావె ||2||
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ||2||
పరిశుద్ధుడా నీకే ఆరాధనా
పరిశుద్ధుడా నీకే ఆరాధన ||2||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...