Friday, 5 August 2016

128. Yesayya Namamlo Sakthi Unnadayya

యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని

పాపాలను క్షమియించే శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం

రోగికి స్వస్థత నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము
మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం

దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం

సృష్టిని శాసించగల్గిన శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లేపగల్గిన శక్తి కలిగినది యేసయ్య నామం

పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం

127. Mahimaku Patruda... Mahonnathuda Adbhuthalu Cheyuvada

మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము ||2||
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటివారు ఎవరు నీవంటివారు లేరు ||2||

స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం
నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటివారు ఎవరు నీవంటివారు లేరు ||2||

అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
మా కరములను జోడించి నిను మహిమ పరచెదం
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటివారు ఎవరు నీవంటివారు లేరు ||2||

126. Mahima Nike Prabhu Ganatha Nike Prabhu

మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు 
స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకె ప్రభూ
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ప్రియ యేసు ప్ర్రభునికే నా యేసు ప్రభునికే

సమీపించరాని తేజస్సునందు వశియించు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ప్రియ యేసు ప్ర్రభునికే నా యేసు ప్రభునికే

ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి ప్రాణమునర్పించితివే
విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ప్రియ యేసు ప్ర్రభునికే నా యేసు ప్రభునికే

ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నను పిలిచి వెలిగించితివే
నీ గుణాతిశయములు ధర నే ప్రచురింప ఏర్పరచుకొంటివే
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ప్రియ యేసు ప్ర్రభునికే నా యేసు ప్రభునికే

125. Mahima Ghanathaku Arhudavu Nive Na Daivamu

మహిమ ఘనతకు అర్హుడవు - నీవె నా దైవము
సృష్టికర్త ముక్తిదాత (2) మా స్తుతులకు పాత్రుడ...
ఆరాధన నీకే - ఆరాధన నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన నీకే - ఆరాధన నీకే

మన్నాను కురిపించినావు
బండనుండి నీళ్ళిచ్చినావు
యెహోవా యీరే - చూచుకొనును (2)
సర్వము సమకూర్చును
ఆరాధన నీకే - ఆరాధన నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన నీకే - ఆరాధన నీకే

వ్యాధులను తొలగించినావు
మృతులను మరి లేపినావు
యెహోవా రాఫా - స్వస్థపరచును (2)
నను స్వస్థపరచును
ఆరాధన నీకే - ఆరాధన నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన నీకే - ఆరాధన నీకే

124. Preminchedan Adhikamuga Aradinthun Asakthitho

ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో
పూర్ణమనస్సుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధనా ఆరాధనా ఓ... ఓ....
ఆరాధనా ఆరాధనా

ఎబినెజరే ఎబినెజరే ఇంతవరకు ఆదుకున్నావు
ఇంతవరకు ఆదుకున్నావు ||2|| ||పూర్ణ||

ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్య
నన్ను చూచావే వందనమయ్య ||2|| ||పూర్ణ||

యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్య
స్వస్థపరిచావే వందనమయ్య ||2|| ||పూర్ణ||

యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ
జయమిచ్చావే వందనమయ్య
జయమిచ్చావే వందనమయ్య ||2|| ||పూర్ణ||

123. Priyuda Ni Prema Padamul Cherithi

ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదన్ ఆనందమానందమే
ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన

నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగెనయ్యా
మంచివాడ మంచి చేయువాడ స్తోత్రము స్తోత్రమయ్య
మంచివాడ.... మహోన్నతుడా.... ఆరాధన.. ఆరాధన

బలియైన గొర్రెగా పాపములన్నిని మోసి తీర్చితివే
పరిశద్ధ రక్తము నాకొరకేనయ్య నాకెంతో భాగ్యమయ్య
పరిశుద్ధుడా... పరమాత్ముడా... ఆరాధన... ఆరాధన...

ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్య రక్తము చింది సాక్షిగ ఉందున్ నిశ్చయం నిశ్చయమే రక్షకుడా.... యేసునాధా... ఆరాధన... ఆరాధన..

122. Aradhana.... Nive Nive Na Athisayamu Nive

ఆరాధనా ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధనా ||2||
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 

నీవే నీవే నా అతిశయము - నీవే నీవే నా పరవశము ||2||

నీవే నీవే నా ఆరాధనా - నీవే నీవే నా ఆదరణ ||2||

నీవె నీవే నా ఆరోగ్యము - నీవే నీవే నా ఆశ్రయము ||2||

నీవే నీవే నా ఆశ్చర్యము - నీవే నీవే నా ఐశ్వర్యము ||2||

నీవే నీవే నా ఆనందము - నీవే నీవే నా అభిషేకము ||2||

నీవే నీవే నా ఆహారము - నీవే నీవే నా ఆధారము ||2||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...