ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో
పూర్ణమనస్సుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధనా ఆరాధనా ఓ... ఓ....
ఆరాధనా ఆరాధనా
ఎబినెజరే ఎబినెజరే ఇంతవరకు ఆదుకున్నావు
ఇంతవరకు ఆదుకున్నావు ||2|| ||పూర్ణ||
ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదన్ ఆనందమానందమే
ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన
నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగెనయ్యా
మంచివాడ మంచి చేయువాడ స్తోత్రము స్తోత్రమయ్య
మంచివాడ.... మహోన్నతుడా.... ఆరాధన.. ఆరాధన
బలియైన గొర్రెగా పాపములన్నిని మోసి తీర్చితివే
పరిశద్ధ రక్తము నాకొరకేనయ్య నాకెంతో భాగ్యమయ్య
పరిశుద్ధుడా... పరమాత్ముడా... ఆరాధన... ఆరాధన...
ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్య రక్తము చింది సాక్షిగ ఉందున్ నిశ్చయం నిశ్చయమే రక్షకుడా.... యేసునాధా... ఆరాధన... ఆరాధన..
ఆరాధనా ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధనా ||2||
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
నీవే నీవే నా అతిశయము - నీవే నీవే నా పరవశము ||2||
నీవే నీవే నా ఆరాధనా - నీవే నీవే నా ఆదరణ ||2||
నీవె నీవే నా ఆరోగ్యము - నీవే నీవే నా ఆశ్రయము ||2||
నీవే నీవే నా ఆశ్చర్యము - నీవే నీవే నా ఐశ్వర్యము ||2||
నీవే నీవే నా ఆనందము - నీవే నీవే నా అభిషేకము ||2||
నీవే నీవే నా ఆహారము - నీవే నీవే నా ఆధారము ||2||
నీవే నా ప్రాణము నీవే నా సర్వము
నీవే నా జీవము యేసయ్యా (2)
మరువలేను నీదు ప్రేమ
విడువలేనయ్యా నీ స్నేహం (3) ||నీవే||
మార్గం నీవే సత్యం జీవం నీవే
జీవించుటకు ఆధారం నీవే (2)
బ్రతుకంతా నీ కొరకై జీవింతును
నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||
తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నా తోడు ఉండె చెలిమి నీవే (2)
అపాయము రాకుండా కాపాడువాడవు
నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||
నీవే నా దేవుడవు ఆరాధింతును
నీవే నా రాజువు కీర్తించెదను
మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే
పరలోకము నుండి వెలుగుగ వచ్చి మార్గము చూపితివి
చీకటి నుండి వెలుగునకు నను నడిపించావు
హోసన్నా మహిమ నీకే
హోసన్నా ప్రభావము రాజునకు
నీవే... నీవే.. నీవే.. నీవే
నీవంటి వారు లేరిలలో యేసయ్యా
నీవె మాదు రక్షణకర్తవు యేసయ్యా
నీ సిలువ శక్తిని ఆశ్రయింతుము యేసయ్యా
నీ పునరుత్థానమే నిత్యజీవము యేసయ్యా
ఆది సంభూతుడవు ఆద్యంత రహితుడవు ||2||
ఆకాశ మహా విశాలమునందున్న సర్వాధికారివి ||2||
మా పాప శాపములన్ని విమోచించితివి
మా రోగములకు స్వస్థత చేకూర్చితివి
పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా నిచ్చితివి
శక్తియు మహిమయు స్తోత్రములకు అర్హుడవు ||ఆది||
ప్రతివాని మోకాలు నీ నామమున వంగును
ప్రతివాని నాలుక యేసుప్రభువని ఒప్పుకొనును
పరలోకమందున్న భూమియందున్న వారిలో
పరలోకతండ్రి అధికముగా హెచ్చించును ||ఆది||
నీదు సింహాసనం నిరంతరం నిలచునది
నీరాజదండం న్యాయార్ధమై ఏలునది
నీతిని ప్రేమించి దుర్ణీతి ద్వేషించువాడవు
నిత్యానంద తైలాభిషేకం నొందినావు ||ఆది||
నీ ప్రేమ నీ శక్తి
నింపుము నాలో
నిను ఆరాధిస్తాను - హృదయమంతటితో
నిను ఆరాధిస్తాను - మనసంతటితో
నిను ఆరాధిస్తాను - బలమంతటితో
యేసు నీవే... నా రాజువు ||2|| ||నీ ప్రేమ||
More Love
More Power
More of You in my Life
I will Worship You with all of My Hear
And I will Worship You with all of Mind
And I will Worship You with all of Strength
You are my Lord ||2|| ||More||