మంచేలేని నాపైన ఎంతో ప్రేమ చూపావు
ఆదియంతమైనవాడవు మానవుని రూపమెత్తావు
పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి
ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ ఋణం తీరునా
లోకాలన్నీ ఏలే రారాజువైన నీవు
సామాన్యుల ఇంట నీ కాలుపెట్టినావు
నీదెంత దీనమనసు నాకెంత ఘనత యేసు
నాశనమైన నన్ను రక్షింపగోరిన నీవు
వాత్సల్యము చూపి నాచెంత కొచ్చినావు
నీలోన జాలి పొంగే నాలోన శాంతి నిండె
చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు
వేకువ వెలుగువిం దర్శనమిచ్చినావు
నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం