వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరూ చూపలేని ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ హల్లెలూయ - మహాదానందమే
1.లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించినప్రేమ లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ
2.ఏ స్థితికైన చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ నీకు బదులు మరణించిన ప్రేమ చిరజీవము నీ కొసగిన ప్రేమ (2) యేసు ప్రేమ......