Tuesday, 23 August 2016

218. Ambaraniki Antela Sambaralatho

అంబరానికి అంటేలా
సంబరాలతో చాటాలా (2)
యేసయ్య పుట్టాడని
రక్షింప వచ్చాడని (2)

ప్రవచనాలు నెరవేరాయి
శ్రమ దినాలు ఇక పోయాయి (2)
విడుదల ప్రకటించే
శిక్షను తప్పించే (2)           ||యేసయ్య||

దివిజానాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి (2)
పరముకు నడిపించే
మార్గము చూపించే (2)           ||యేసయ్య||

సుమ వనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి (2)
ఇలలో నశియించే
జనులను ప్రేమించే (2)           ||యేసయ్య||

217. Andala Thara Arudenche Nakai

అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని               ||అందాల తార||

విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్         ||అందాల తార||

యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి
యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు      ||అందాల తార||

ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన           ||అందాల తార||


216. Vastunnanu Prabhuva Vastunnanu

వస్తున్నాను ప్రభువా వస్తున్నాను
నీ యందమైన మందిరానికి వస్తున్నాను

వచ్చిన పాపిని వద్దనవద్దు కన్నతండ్రి
నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము పరమతండ్రి

నింగినేల నీవెనయ్యా యేసునాధా
నిఖిల జగములు నీవేనయ్యా దేవదేవ

పాపులనెల్ల ప్రేమించావు యేసునాధా
మా పాపాలన్ని క్షమియించావు దేవదేవ

అట్టిబోధ నాకందించు యేసునాధా 
నీ యాత్మతో నింపుము నన్ను దేవదేవా

Saturday, 20 August 2016

215. Yesu Neeve Chalu Naku

యేసు నీవె చాలునాకు - వేరెవ్వరు అక్కరలేదు
నీవె నా ప్రాణము నీవె నా ధ్యానము
మనుషులు నను మరచిన... నా వారే విడిచిన

నింగినేల మారినా స్థితి గతులు మారినా
ఎన్నడెన్నడు మారనిది యేసునీ ప్రేమ
ఎన్నడైనను వీడనిది యేసునీ ప్రేమ
కంటిపాపవలె కాయు నీవుండగ..

దారితొలగి యుండగా మార్గమును చూపించినా
ముళ్లకిరీటము శిరమున ధరియించిన మారని ప్రేమ
రక్తము నాకై చిందించిన రక్షకుని ప్రేమ
నిత్యజీవమొసగె నీవుండగ..

214. Yesu Nive Kavalayya Natho Kuda Ravalaya

యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా
ఘనుడ నీ దివ్య సన్నిధి నను ఆదుకునే నా పెన్నిధి
నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా

నీవే నాతో వస్తే దిగులు నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు

నీవే నాతో వస్తే కొరత నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు

నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు

213. Yesayya Nitho Unte Nakentho Aanadamu

యేసయ్యా నీతో ఉంటే నాకెంతో ఆనందము
నీ సన్నిధిలో నేనుండుటే నాకెంతో సంతోషము
నీ ప్రేమను చాటెదన్. నీ కృపను ఘనపరచెదన్
స్తుతికి పాత్రుడ స్తోత్రార్హుడ విజయము నీకే

నా దుఃఖ సమయములో ఓదార్పు నిచ్చితివి
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
ఓ దేవా నా ప్రభువా నన్ను ప్రేమించినావే

అగాధజలములో నేనుండగా నీ కృపతో లేపితివి
నీ దక్షిణ హస్తమును నాపై ఉంచితివి
నా విమోచకా ప్రాణేశ్వరా నన్ను కాపాడినావు

212. Yesayya Natho Unte Roju Oka Panduga

యేసయ్య నాతో ఉంటే రోజూ ఒక పండుగ
కీడేది దరికిరాదు ఆయనుంటె అండగా

కరువు కాటకాలు నన్నేమి చేయలేవుగ
లేమి అపజయాలు నను కృంగదీయ లేవుగ

ఇరుకు ఇబ్బందులు నన్నేడిపించలేవుగ
శ్రమలు వ్యాధి బాధలు నిరాశపరచ లేవుగ

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...