పండుగ పెంతెకోస్తు పండుగ - విశ్వాసులారా -
పండుగ ఈ వేళ గొప్ప పండుగ = పండుగ పరిశుద్ధాత్మ
భక్త జనముల హృదయములలో - నిండుగానే
కుమ్మరింపై - నిలిచి వాసము చేసినట్టి
నూట యిరువది మంది యొక్క - చోట నొక్కరై యుండి
కూటమున ప్రార్ధించు చుండ - కుమ్మరింపు గలిగినట్టి
నేడు నందరు నేకముగనే - కూడుకొని యది తలంచుకొని
వేడుకొన్న యెడల ఆత్మ - విరివిగానే వచ్చునట్టి
ఆపదలపై ఆపదలు ని - న్నావరించుకొనును గాని
ఆప శక్యము గాని యుత్సా - హంబు మది వ్యాపించునట్టి
ఆత్మ కుమ్మరింపె పరిశు - ద్ధాత్మ బాప్తిస్మంబు
పరిశు - ద్ధాత్మాభిషేకంబు ఆత్మ నొందుట ఆత్మ పూర్ణత
జీవ బోధలు చేయ గొప్ప - జివ గలుంగును వాక్య మందలి
భావములు ఒక ప్రక్క నుండి - ప్రజల కర్ధమగుచు నుండు
కుమ్మరింపు కలుగగానే - కుమ్మరములు - కూలిపోవును
ముమ్మరము గా చిక్కులెన్నో - ముంచుకొని పైబడెడు గొప్ప
జనములన్నియు ఆత్మ స్నానము - దినక్రమమున నొందుగాక
జనక కుమారాత్మలకును - ఘనత మహిమ మహిమ మహిమ మహిమ
నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది
నా ప్రాణేశ్వరా.. యేసయ్యా
నా సర్వస్వమా.. యేసయ్యా II నిరంతరంII
చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను (2)
నీలోనే నేను వెలగాలనీ
నీ మహిమ నాలో నిలవాలనీ (2)
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై II నిరంతరంII
నీ రూపము నేను కోల్పోయినా
నీ రక్తముతో కడిగితివి (2)
నీతోనే నేను నడవాలనీ
నీవలెనే నేను మారాలనీ (2)
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై II నిరంతరంII
తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోనే నాటితివి (2)
నీలోనే నేను చిగురించాలనీ
నీలోనే నేను పుష్పించాలనీ (2)
పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై II నిరంతరంII