క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా
క్రీస్తుప్రభువు నీ క్రియల మూలంబుగ కీర్తి పొందునని తెలుసునా
కీడు నోడింతువు తెలుసునా కిటుకు విడగొట్టుదువు తెలుసునా
1. పరమధర్మంబులు భాషలన్నియందు ప్రచురింతువని నీకు తెలుసునా
నరుల రక్షకుడొక్క నజరేతుయేసని నచ్చచెప్పుదువని తెలుసునా
నడిపింతువని నీకు తెలుసునా నాధుని జూపింతువు తెలుసునా
2. లెక్కకు మించిన రొక్కము నీచేత చిక్కియుండునని తెలుసునా
ఎక్కడికైనను ఎగిరివెళ్ళి పనులు చక్కబెట్టుదువని తెలుసునా
చక్కపరతువని తెలుసునా సఫలపరతువని తెలుసునా
3. యేసుని విషయాలు ఎరుగని మానవులు ఎచట నుండరని తెలుసునా
యేసులో చేరని ఎందరో యుందురు ఇదియు కూడ నీకు తెలుసునా
ఇదియే నా దుఃఖము తెలుసునా ఇదియే నీ దఃఖము తెలుసునా
4. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువని తెలుసునా
అన్ని ఆటంకములు అవలీలగా దాటి ఆవలకు చేరెదవు తెలుసునా
అడ్డురారెవరును తెలుసునా హాయిగనందువు తెలుసునా
5. నీ తండ్రియాజ్ఞలన్నిని పూర్తిగ నీవు నెరవేర్తువని నీకు తెలుసునా
పాతాళము నీ బలము ఎదుట నిలువబడనేరదని నీకు తెలుసునా
భయపడునని నీకు తెలుసునా పడిపోవునని నీకు తెలుసునా
6. ఒక్కడవని నీవు ఒడలిపోవద్దు నీ ప్రక్కననేకులు తెలుసునా
చిక్కవు నీవెవరి చేతిలోనైనను చిక్కిపోవని నీకు తెలుసునా
నొక్కబడవని నీకు తెలుసునా సృక్తిపోవని నీకు తెలుసునా
7. నేటి అపజయములు నేటి కష్టంబులు కాటిపాలైపోవున్ తెలుసునా
బూటకపు బోధకులు బోయి పర్వతాల చాటున దాగెదరు తెలుసునా
చాటింపకుందురు తెలుసునా గోటు చేయలేరు తెలుసునా