బండసందున పావురమా - పేటుబీటుల పావురమా
ప్రియుడు నిన్ను కోరినాడు - భీతి చెందకుమా
వరుడు నిన్ను కోరినాడు - కలత చెందకుమా
సిద్ధపడుమా ఓ సంఘమా
క్రీస్తు వచ్చు వేళాయె వేచియుండుమా
యేసు వచ్చు వేళాయె వేచియుండుమా
ప్రియుడు నిన్ను కోరెను - నీ వరుడు నిన్ను కోరెను
నీ స్వరము వినిపించుమా - నీ ముఖము చూపించుమా
యేసురాజు దిగువచ్చు వేళ ||2||
నీవు సంసిద్ధమా - నీవు పరిశుద్ధమా ||సిద్ధ||
కొండ పేటులందున - బండ బీటులందున
నీ గూడు నిర్మింపుమా - నీ ప్రియునికై చూడుమా
లోక ఆశలు నీకేలనమ్మా ||2||
సిద్దె వెలిగించుమా - సిద్ధముగ నుండుమా ||సిద్ధ||
సాగరాలు పొంగినా - నింగి నేలకొరిగినా
భయమేల ఓ సంఘమా - దిగులేల ఓ సంఘమా
బండక్రీస్తే నీ అండనుండ ||2||
గీతములు పాడుమా - నీ ప్రియుని వీక్షింపుమా ||సిద్ధ||
ద్రాక్షచెట్టు పూతపట్టి - వాసనలిచ్చుచున్నవి
చలికాలమే గడిచెనమ్మా - నిదురేల నీకింకలెమ్మా
వరుడు యేసు దిగివచ్చు వేళ ||2||
తరుణ మేతెంచెనమ్మా - నీ ప్రియుని సంధించుమా ||సిద్ధ||
Super song
ReplyDeleteSuper
ReplyDeleteచాల మంచి పాట
ReplyDeleteSuperb song.. chala deep meaning vunna song
ReplyDeleteRaising and repentance song. Praise tha load.
ReplyDelete