యేసునాధుని చెంత చేరుము
నీ దురంత వింత పాపమంత పోవును
యేసునాధుని చేరి వేడుము
నీదు హృదయమంత యేసు శాంతి నిండును
యేసే మార్గం సత్యం జీవం
రావా సోదరా సోదరీ జాలమేలరా
సిలువమ్రానుపై యేసు వ్రేలాడెన్
సకల లోక పాపమంత పరిహరించెను
సిలువ నీడలో యేసు తోడుగా
అవధి లేని ఆ ప్రేమ నిన్ను పిలువగా ||రావా||
యేసుప్రేమలో సేద దీరుము
అలసినట్టి నీ మది విశ్రాంతి నొందును
యేసు ప్రేమలో నిలిచియుండుము
ఆ ప్రేమ నీలో ప్రభావింపగా ||రావా||
యేసు వెలుగును వెంబడించుము
యేసుబాటలో చీకటసలే యుండదు
యేసు వెలుగులో నడిచి వెళ్లుము
ఆ వెలుగు నీలో ప్రకాశింపగా ||రావా||