జయ విజయమని పాడుదమా
జయ విజయుడగు యేసునకు
అపజయమెరుగని దేవునకు
జయస్తోత్రం స్తుతి చేయుదమా
ఇహామందు పలు ఆపదలు ఎన్నో కలిగినను
నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును
Its a wonderful blog for telugu christian songs. Both Lyrics and Audio/Video available in this blog. you will definitely like this blog.
జయ విజయమని పాడుదమా
జయ విజయుడగు యేసునకు
అపజయమెరుగని దేవునకు
జయస్తోత్రం స్తుతి చేయుదమా
ఇహామందు పలు ఆపదలు ఎన్నో కలిగినను
నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును
మహా దయాళుడు యెహోవా నన్నిల కరుణించి
నా పాపముల నన్నింటిని మన్నించి మలినము తొలగించున
గెత్సేమనే తోటలో ప్రార్ధింప నేర్పితివా...
ఆ ప్రార్ధనే మాకునిలా రక్షణను కలిగించెను
ఆ... ఆ.... ఆ... ఆ.... ||గెత్సే||
నీ చిత్తమైతే ఈ గిన్నెను - నా యొద్దనుండి తొలగించుమని
దు:ఖంబుతో భారంబుతో - ప్రార్ధించితివా తండ్రి ||గెత్సే||
ఆ ప్రార్ధనే మాకునిలా - నిరీక్షణ భాగ్యంబు కలిగించెను
నీ సిలువే మాకు శరణం - నిన్న నేడు రేపు మాపు ||గెత్సే||
ఇది కోతకు సమయం
పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2)
పైరును చూచెదమా – పంటను కోయుదమా (2)
కోతెంతో విస్తారమాయెనే
కోతకు పనివారు కొదువాయెనే (2)
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే (2)
సంఘమా మౌనము దాల్చకుమా
కోసెడి పనిలోన పాల్గొనుమా (2)
యజమాని నిధులన్ని నీకే కదా (2)
శ్రమలేని ఫలితంబు నీకీయగా
వలదంచు వెనుదీసి విడిపోదువా (2)
జీవార్ధ ఫలములను భుజియింపమా (2)
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం (2) ||యెహోవా||
నా శత్రువులు నను చుట్టినను
నరకపు పాశములరికట్టినను (2)
వరదవలె భక్తిహీనులు పొర్లిన (2)
విడువక నను ఎడబాయని దేవా (2) ||యెహోవా||
మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నతదుర్గమై రక్షణ శృంగమై (2)
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2)
ఆదరెను ధరణి భయకంపముచే (2) ||యెహోవా||
నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును (2)
జలరాసులనుండి బలమైన చేతితో (2)
వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) ||యెహోవా||
పౌరుషముగల ప్రభు కొపింపగా
పర్వతముల పునాదులు వణకెను (2)
తన నోటనుండి వచ్చిన అగ్ని (2)
దహించివేసెను వైరులనెల్లను (2) ||యెహోవా||
మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును (2)
ఉరుములు మెరుపులు మెండుగ జేసి (2)
అపజయమిచ్చును అపవాదికిని (2) ||యెహోవా||
దయగలవారిపై దయ చూపించును
కఠినులయెడల వికటము జూపును (2)
గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2)
సర్వము నెరిగిన సర్వాధికారి (2) ||యెహోవా||
నా కాళ్ళను లేడి కాళ్ళగజేసి
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2)
రక్షణ కేడెము నాకందించి (2)
అక్షయముగ తన పక్షము జేర్చిన (2) ||యెహోవా||
యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2)
అన్యజనులలో ధన్యత జూపుచు (2)
హల్లెలూయ స్తుతిగానము చేసెద (2) ||యెహోవా||
మనోవిచారము కూడదు నీకు
మహిమ తలంపులే కావలెను
దినక్రమాన శాంతి గుణంబులు
దీనులకిచ్చుచుందును
ఆలస్యమైనంత మాత్రమున
అవి నెరవేర వనవద్దు
కాలము పరిపూర్ణంబుకాగా
ఖచ్చితముగ అన్నియు నెరవేరును
నిత్యానందము సత్యానందము
నీలోనేనమర్చితి
అత్యానందము అగపడుచుండును
ఆలోచించుచున్న కొలది
కోరవు నీకు కావలసినవి
ఊరకనె నీకిచ్చెదను
ధారాళముగ నిచ్చుటకు నా ధననిధి
వస్తువులన్నియు గలవు
నీరసపడకుము నీరసపడకుము
నీవె నా ఆస్తిగదా
నారక్తముతో సంపాదించితి
నన్ను నీ ఆస్తిగ గైకొనుము
ఆనందతైలముతో నిన్ను
అభిషేకించి యున్నాను
స్నానము ప్రభు భోజనము ప్రజలకు
జరుపుట సరియని అనుచున్నాను
నీకు కావలసినవి అడుగుము
నేను తప్పక ఇచ్చెదను
నీకు ఇచ్చుట నాకానందము
నీవు అడుగుట ముచ్చటనాకు
నీ కష్టములు నీ కోరికలు
నాకెరుకె అవి యుండవుగా
లేకుండగా జేసెదను అప్పుడు
లేడివలె గంతులు వేయుదువు
నీకవసరమైనవి కావలసిన
నిఖిల వస్తువుల కాజ్ఞాపింతును
కాకులకాజ్ఞయిచ్చి
ఏలియాకు ఆకలితీర్చలేదా
సైకిళ్ళు స్టీమర్లు బండ్లు
సంచారమునకు అవసరమా
లోకులు కోరిన యెడల అవియు
నీకవి సుళువుగ లభియించు
ఎండయు చలియు వానయు గాలియు
ఏమియు చేయ నేరవు నిన్ను
తిండికి బట్టకు బసకు శద్ధికి
తీరికకు యే కొదువయె యుండదు
జంతువు పశువు పురుగు పక్షి
జబ్బు ఏమియు చేయవు నీకు
సంతోషముతో నా సందేశము
చాటగ అదియు చాటుచునుండుము
నీ బలహీనత తట్టుచూడకు
నా బలము తట్టిదిగో చూడుము
నీ బలమునకు మించిన పనులు
నా బలమేగదా చేయవలెసెను
పాపివని నీకెవడు చెప్పెను
పావనుడవై యుండగను
శాప మరణమురాదు నీకు
చావును చంపిన జీవము నేనే
నా రూపలావణ్యములు
నీ రూప లావణ్యములగును
నా రక్తము ప్రతి నిమిషము నీలో
ధారగ ప్రవహించును అది జీవము
నీవే యని నమ్మిక
యేసునాకు నీవే యని నమ్మిక
నీవే మార్గంబు నీవే సత్యంబు
నీవే జీవంబు - నీవే సర్వంబు IIనీవేII
పెడాదారిని బోవగా
నామీదికి ఇడములెన్నియో రాగ
అడవిలో బడి నేను- అడలుచునుండంగ
తడవకుండ దొరుకు - ధన్యమౌ మార్గంబు IIనీవేII
తడవని దారి దొరుక
దానింబడి నేనడచుటెట్లో తెలియక
జడియుచుండగ నన్ను - జాగ్రత్తగా కడకు
నడిపించుకొని వెళ్ళు – నయమార్గదర్శిని IIనీవేII
కారు మేఘము పట్టగ
నా మనస్సులో కటిక చీకటి పుట్టగ
ఘోరాపదల జేరి - దారియని భ్రమపడగ
తేరిచూడగల్గు - తేజోమయ మార్గంబు IIనీవేII
లేనిపోని మార్గంబు
లెన్నోయుండ - జ్ఞానోపదేశంబు
మానుగజేయుచు - వానిని ఖండించి
నేనే మార్గంబన్న - నిజమైన మార్గంబు IIనీవేII
ఎటుజూచిన మార్గములే
మోసముచేయు - హీనశత్రువర్గములే
ఎటుబోవవలయునో నే - నెరుగనివాడనై
కటకటయని యేడ్వ - ఘన మోక్ష మార్గంబు IIనీవేII
జబ్బు మరల ముదరగ
కల ధైర్యంబు - జారి గుండెలదరగా
నిబ్బరముగా మనసు నిలువక యున్నప్పుడు
దబ్బున నను జేర్చు - దయగల వైద్యుడవు IIనీవేII
నరలోకము నుండి
పరలోకంబు వరకు నిచ్చెనగా నుండి
నరులకు ముందుగా - నడచుచు ముక్తికి
సరిగాకొనిపోవు - సుస్థిరమైన మార్గంబు IIనీవేII
ధైర్యంబుగా నుండుము
ఓ విశ్వాసి - ధైర్యంబుగా నుండుము
ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతియించి
వచ్చిన శ్రమలలో – ఆనందించుము IIనీవేII
నీకుతోడై యుంటిని
నీ మనవిని ఆలించియుంటిని
అన్నిటి నుండి నిన్ ఆదరించిన తండ్రిన్
ఆనందముతో - స్తోత్రించు చుండుము IIనీవేII
నిను నమ్మినచో – సిగ్గుపడనీయవు
నను నెమ్మదితో - నీవె ఉంచెదవు
ఆపత్కాలమున - నమ్ముకొనదగిన
యేసూ నీవే - ఆధారము
యేసూ నీవే - నా ప్రాణము
తెలివిని నమ్ముకొని పడ్డాను
బుద్ధిజ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను ||యేసూ||
బలమును నమ్ముకొని భంగపడ్డాను
శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను ||యేసూ||
ధనమును నమ్ముకొని దగా పడ్డాను
సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను ||యేసూ||
మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను
సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను||యేసూ||
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...