నా జీవిత వ్యధలందు - యేసే జవాబు
యేసే జవాబు - ప్రభు యేసే జవాబు IIనాII
తీరని మమతలతో - ఆరని మంటలతో
ఆశ నిరాశలలో - కూలెను నా బ్రతుకే
ననుగని వచ్చెను - తనకృప నిచ్చెను
కరుణతో ప్రేమించి - కలుషము కడిగెను IIనాII
చీకటి వీధులలో - నీటుగ నడిచితిని
లోకపు టుచ్చులలో - శోకము చూచితిని
ననుగని వచ్చెను - తనకృప నిచ్చెను
కరుణతో ప్రేమించి - కలుషము కడిగెను IIనాII
ద్రోహుల నమ్ముకొని - స్నేహము జేసితిని
యిడుమల పాల్జేసి - ఎడబాసిరి నన్ను
ననుగని వచ్చెను - తనకృప నిచ్చెను
కరుణతో ప్రేమించి - కలుషము కడిగెను IIనాII
హంగుల వేషముతో - రంగుల వలయములో
నింగికి నేనెగిరి - నేలకు వ్రాలితిని
ననుగని వచ్చెను - తనకృప నిచ్చెను
కరుణతో ప్రేమించి - కలుషము కడిగెను IIనాII