Tuesday, 27 February 2018

396. Gadandhakaramlo Ne Nadachina Velalalo

గాఢాంధకారములో నే నడచిన వేళలలో
కంటిపాపవలె నన్ను కునుకక కాపాడును
ప్రభువైన యేసునకు జీవితమంతా పాడుదన్‌
జడియను బెదరను నా యేసు నాతోనుండగ

మరణంపు లోయలలో - నే నడచిన వేళలలో
నీ దుడ్డుకర్రయు నీ దండమాదరించును
నా గిన్నె పొర్లుచున్నది శుద్ధాత్మతో నింపెను
జడియను బెదరను నా యేసు నాతోనుండగ

అలలతో కొట్టబడిన నా నావలో నేనుండగ
ప్రభుయేసు కృప నన్ను విడువక కాపాడును
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును
జడియను బెదరను నా యేసు నాతోనుండగ

395. Kallallo Kannirenduku Gundello Digulenduku

కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు కలత చెందకు
నెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||
హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగా
మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||
కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినా
లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)
యేసే నీ రక్షకా – దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా – సంతసించుము నీవిక ||కళ్ళల్లో||

394. Kalavara Padavaladu Nivu Kalavara Padavaladu

కలవర పడవలదు - నీవు కలవరపడవలదు

యేసు నిన్ను వదలిపెట్టరు

ముళ్ళ మకుటం నీ కోసమే - రక్తమంత నీ కోసమే

పాపమంతా సమర్పించు - నీ పాపమంతా సమర్పించ

పరిశుద్ధునిగా అవుతావు - నీవు పరిశుద్ధునిగా అవుతావు

కల్వరి శిఖరముపై - గాయపడ్డ యేసుని చూడు

చేయి చాచి పిలుస్తున్నాడు - తన చేయి చాచి పిలుస్తున్నాడు

కన్నీటితో పరుగిడి రండి - మీరు కన్నీటితో పరుగిడి రండి

ఎల్లప్పుడు నీతో ఉన్నాడు - చేయిప్టి నడిపిస్తున్నాడు

కన్నీటిని తుడిచే దేవుడు - నీ కన్నీటిని తుడిచే దేవుడు

కంటిపాపవలె కాచే దేవుడు - నిన్ను కంటిపాపవలె కాచే దేవుడు

393. Kannirelamma Karuninchu Yesu Ninnu Viduvabodamma

కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి కలత మాన్పె (2)
యేసే తోడమ్మా            
నీకేమీ లేదని ఏమీ తేలేదని
అన్నారా నిన్ను అవమాన పరిచారా
తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని
రేపటిని గూర్చి చింతించుచున్నావా
చింతించకన్న యేసు మాటలు మరిచావా
మారాను మధురంగా మార్చెను చూసావా (2)
నీకెవరూ లేరని ఏం చేయలేవని
అన్నారా నిన్ను నిరాశపరచారా
పురుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని
నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా
నేనున్నానన్న యేసు మాటలు మరిచావా
కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2) 

392. Kannitiki Javabu Undi Nilo Vedana Thiripovunu

కన్నీటికి జవాబు ఉంది నీలో వేదన తీరిపోవును

యేసయ్య విన్నాడమ్మా నీదు కన్నీటి ప్రార్ధన

నిను విడువను యెడబాయననీ.. పలికిన యేసే నీ తోడమ్మా

విలపించకు దిగులొందకు భయమెందకు కలత చెందకు

బూడిదకు ప్రతిగా పూదండతో అలంకరించును నిన్ను 

దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలం అభిషేకించును 

ఉల్లాస వస్త్రములు ధరియింప జేయును 

అవమానమునకు ప్రతిగా ఘనతొందెదవు 

భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రము

నీకొసగే వేళ ఇదే.. నీ కొసగే వేళ ఇదే

దేవుని మహిమ నీ పైన ఉదయించెను చూడుము

దేవునికి స్తోత్రములు చెల్లింతుము జయముగ హర్షింతుము

లెమ్ము తేజరిల్లు సంతోష గానముతో 

యేసుని నామమే బలమైన ఆశ్రయం

నా కృప నీకు చాలునని పలికెను 

ప్రభు యేసే ఆభరణం.. ప్రభు యేసే నీ కాభరణం 

391. Kannathalli Cherchunatlu Nannu Cherchu Na Priyudu

కన్న తల్లి చేర్చునట్లు
నను చేర్చు నా ప్రియుడు (2)
హల్లేలుయా హల్లేలుయా (2)
కౌగిటిలో హత్తుకొనున్‌
నా చింతలన్‌ బాపును (2)        ||కన్న||
చేయి పట్టి నడుపును
శికరముపై నిలుపును (2)        ||కన్న||
నా కొరకై మరణించే
నా పాపముల్‌ భరియించే (2)    ||కన్న||
చేయి విడువడు ఎప్పుడు
విడనాడడు ఎన్నడు (2)        ||కన్న||

390. Evaraina Unnara Echataina Unnara

ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా

ఈలాంటి  స్నేహితుడు

నా యేసయ్య లాంటి  మంచి స్నేహితుడు

ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు

హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండ

ప్రేమచూపు వారు లేరు లోకమందునా

నేను కోరుకోకుండా నా కోసము

తనకు తానే చేసినాడు సిలువ యాగము

అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా

జతను కోరువారు దొరకరు ఎంత వెదికినా

నీచుడనని చూడకుండా నా కోసము

మహిమనంత వీడినాడు ఏమి చిత్రము

స్వార్ధము లేకుండా ఫలితం ఆశించకుండా

మేలుచేయువారు ఎవరు విశ్వమందునా

ఏమి దాచుకోకుండా నా కోసము

ఉన్నదంత ఇచ్చినాడు ఏమి త్యాగము

 

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...