Tuesday, 27 February 2018

395. Kallallo Kannirenduku Gundello Digulenduku

కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు కలత చెందకు
నెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||
హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగా
మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||
కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినా
లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)
యేసే నీ రక్షకా – దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా – సంతసించుము నీవిక ||కళ్ళల్లో||

No comments:

Post a Comment

Neevu Thappa Nakevaru Unnarayya Lyrics in Telugu | Christian Song #591

Neevu Thappa Nakevaru Unnarayya Lyrics in Telugu | Christian Song #591 Song No: 591 Language: Telugu Category: Worship Song 🎵 Te...