ఆశయితే
ఉంది నాలో - అందుకోలేకున్నాను
నా
చేయి పట్టుకో నా రక్షకా
నా చేయి పట్టుకో నా యేసయ్యా
నీలోనే నేను నిలవాలని
నీ
ఆత్మలో నేను నడవాలని
నీ
రూపునే పొందుకోవాలని
నీ మనస్సు నాకిల కావాలని
నీ ప్రేమనే కలిగి ఉండాలని
నీ
ఫలము నాలో పండాలని
నీ
కృపతో నా మది నిండాలని
ఆత్మాగ్ని నాలో ఉండాలని
ఆనాటి పౌలులా బ్రతకాలని
ఆశ్చర్య
కార్యాలు చేయాలని
ఆత్మీయ
శిఖరాల నెక్కాలని
అపవాదిని
చితక త్రొక్కాలని