Tuesday, 27 March 2018

437. Enni Thalachina Edi Adigina


ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా

నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా      ||ఎన్ని||

నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా      ||ఎన్ని||

ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా      ||ఎన్ని||

నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా         ||ఎన్ని||

436. Idigo Deva Na Jivitham Apadamasthakam Nikankitham


ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4)                       ||ఇదిగో||

పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం                         ||ఇదిగో||

నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము           ||ఇదిగో||

విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా   ||ఇదిగో||

435. Asayithe Undi Nalo Andukolekunnanu

ఆశయితే ఉంది నాలో - అందుకోలేకున్నాను

నా చేయి పట్టుకో నా రక్షకా

నా చేయి పట్టుకో  నా యేసయ్యా

నీలోనే నేను నిలవాలని

నీ ఆత్మలో నేను నడవాలని

నీ రూపునే పొందుకోవాలని

నీ మనస్సు నాకిల కావాలని

నీ ప్రేమనే కలిగి ఉండాలని

నీ ఫలము నాలో పండాలని

నీ కృపతో నా మది నిండాలని

ఆత్మాగ్ని నాలో ఉండాలని

ఆనాటి పౌలులా బ్రతకాలని

ఆశ్చర్య కార్యాలు చేయాలని

ఆత్మీయ శిఖరాల నెక్కాలని

అపవాదిని చితక త్రొక్కాలని

434. Yesayya Namam Prithigala Namam Satileni Namam Madhura Namam

యేసయ్య నామము ప్రీతిగల నామము
సాటిలేని నామము మధుర నామం

పాపము పోవును భయమును పోవును
పరమ సంతోషము భక్తులకీయును

పరిమళ తైలము యేసయ్య నామము
భువిలో సువాసన ఇచ్చెడి నామము

భూలోకమంతట మేలైన నామము
సైన్యాధిపతియగు యేసయ్య నామము

నిన్న నేడు మారని నామము
నమ్మిన వారిని విడువని నామము

ప్రతివాని మోకాలు వంచెడి నామము
ప్రతివాని నాలుక స్తుతించెడి నామము

సాతాను సేనను జయించిన నామము
పాప పిశాచిని తరిమడి నామము

భక్తుల కాచెడి శక్తిగల నామము
పరమున చేర్చెడి పరిశుద్ధ నామము

433. Yehova Naku Velugayye Yehova Naku Rakshanayye

యెహోవా నాకు వెలుగయ్యే 
యెహోవా నాకు రక్షణయ్యే
నా ప్రాణ దుర్గమయ్యె
నేను ఎవరికి ఎన్నడు భయపడను – (2)

నా తల్లియు నా తండ్రియు
ఒకవేళ విడచినను (2)
ఆపత్కాలములో చేయి విడువకను
యెహోవా నన్ను చేరదీయును (2)        ||యెహోవా||

నా కొండయు నా కోటయు
నా ఆశ్రయము నీవే (2)
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో
స్తుతి గానము చేసెదను (2)        ||యెహోవా||

నాకు మార్గమును ఉపదేశమును
ఆలోచన అనుగ్రహించే (2)
నీ ఆజ్ఞలలో జీవించుటకు
కృపతో నింపి కాపాడుము (2)        ||యెహోవా||

432. Yudhamu Yehovade Yudhamu Yehovade

యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే
రాజులు మనక్వెరు లేరు శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతియైన యెహోవా మన అండా

బాధలు మనలను కృంగదీయవు
వ్యాధులు మనలను పడదోయవు
విశ్వాసమునకు కర్తయైన యేసయ్యే మన అండ

యెరికో గోడలు ముందున్నా
ఎఱ్ఱ సముద్రము ఎదురైనా
అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక

అపవాదియైన సాతాను
గర్జించు సింహము వలె వచ్చిన
యూదా గోత్రపు సింహమైనా యేసయ్య మన అండ

431. Bhayamu Ledu Digulu Ledu Jivitha Yathralo

భయములేదు దిగులులేదు - జీవిత యాత్రలో
యేసుప్రభువు మనతోనుండ - భయములేదుగా
హల్లేలూయ – హల్లేలూయ

గాలి తుఫాను రేగి అలలు పొంగిన
విశ్వాసనావ మునిగి కొట్టబడిన
సముద్రం పొంగి నురుగు కట్టిన
యేసుప్రభువు మనతోనుండ - భయములేదుగా
హల్లేలూయ – హల్లేలూయ

వ్యాధి బాధలన్ని నన్ను ముట్టిన
అంతులేని వేదన నాకు కలిగినా
గర్జించు సింహము ఎదరు వచ్చినా
యేసుప్రభువు మనతోనుండ - భయములేదుగా
హల్లేలూయ – హల్లేలూయ

శత్రువులను చూచి విస్మయమొందకు
నీతోకూడ వచ్చువాడు నీ దేవుడే
నిన్నెన్నడు విడువడు ఎడబాయడు
యేసుప్రభువు మనతోనుండ - భయములేదుగా
హల్లేలూయ - హల్లేలూయ

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...