Wednesday, 2 September 2020

554. Aanadinchandi Andaru Aanandichandi (Christmas Song)



ఆనందించండి అందరు ఆనందించండి
ఆరాధించండి  అందరు ఆరాధించండి
చప్పట్లు కొట్టి గొంతులు విప్పి రక్షణ కీర్తన పాడండి (2)
రక్షణ క్రీస్తుడి కీర్తించండి 
గుడ్డివారు కళ్లారా చూస్తున్నారు..
చెవిటివారు చెవులారా వింటున్నారు..(2)
మూగవారు మనసారా పాడుతున్నారు
కుంటివారు ఆశతీర ఆడుతున్నారు
యేసురాజు పుట్టినరోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు (4)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

కుల పిచ్చొలు కళ్ళు తెరుచుకున్నారు
మత ముచ్చొలు మనసు మార్చుకున్నారు (2)
దైవ మానవ సమసమాజం అన్నారు
దేవుని రాజ్యం దిగివచ్చిందని అన్నారు
యేసురాజు పుట్టినరోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు (4)

Tuesday, 16 June 2020

553. Yesu Nee Matalu

యేసు నీమాటలు-నాజీవితానికి క్రొత్తబాటలు 
నాపాదములకు దీపం నాత్రోవలకు వెలుగు 
నీవాక్యమే నన్నుబ్రతికించెను 
నావారునన్నునిందించి అపహసించగ
ఏత్రోవలేక తిరుగుచుండగ "2"
నీహస్తముతో ఆదరించితివి
నీకౌగిలిలో హత్తుకొంటివి "2" "యేసు
నీ శిలువ రక్తముతో నన్నుశుద్దిచేసి
నీరాజ్యములో చేర్చుకొంటివి "2"
నీవాక్యముతో బలపరచితివి..
నీ సువార్త చాటింప భాగ్యమిచ్చితివి

Tuesday, 19 May 2020

552. Inthalone Kanabadi Anthalone Mayamayye

ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే
అల్పమైన దానికా ఆరాటం
త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి
స్వల్పమైనదానికా పోరాటం
కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం
దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2)
బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా
అంతరించిపోయెను భువినేలిన రాజులు (2)
నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా
చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా  
మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2)
ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున
చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో 

Monday, 23 March 2020

551. Kalvari Giripai Siluva Baram

కల్వరి గిరిపై సిలువ భారం
భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును
సిలువ పైన అర్పించితివా (2)
దుష్టుండనై బల్లెము బూని
గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2)
కేక వేసి నీదు ప్రాణం
సిలువ పైన అర్పించితివా (2)       ||కల్వరి||
మూడు దినములు సమాధిలో
ముదము తోడ నిద్రించితివా (2)
నా రక్షణకి సజీవముతో
సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2)   ||కల్వరి||
ఆరోహణమై వాగ్ధానాత్మన్
సంఘము పైకి పంపించితివా (2)
నీ రాకడకై నిరీక్షణతో
నిందలనెల్ల భరించెదను (2)         ||కల్వరి||

550. Kalamulatho Rayagalama

కలములతో రాయగలమా
కవితలతో వర్ణించగలమా
కలలతో వివరించగాలమా
నీ మహోన్నతమైన ప్రేమా (2)
ఆరాధింతును (4)
రారాజువు నీవే
నా తండ్రివి నీవే
నిను విడువను ఎడబాయను (2)
ఆకాశములు నీ మహిమను
వివరించుచున్నవి
అంతరిక్షము నీ చేతి పనిని
వర్ణించుచున్నది (2)
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)     ||ఆరాధింతును||
సెరాపులు కెరూబులు
నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహా దూతలు ప్రధాన దూతలు
నీ నామము కీర్తించుచున్నవి (2)
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)      ||ఆరాధింతును||

549. Kannillatho Pagiligina Gundetho

కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2)
విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను
కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2)
విడువడు నిన్ను
రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినా
కాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునా
ప్రాణమిచ్చి ప్రేమ పంచినా – పేరు పెట్టి నిన్ను పిలచినా
నీ చేయి పట్టి విడచునా – అనాథగా నిన్ను చేయునా           ||విడువడు||
అంధకారమడ్డు వచ్చినా – సంద్రమెంత ఎత్తు లేచినా
నిరాశలే పలకరించినా – క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
బాధ కలుగు దేశమందునా – బంధకాలు ఊడకుండునా
శత్రువెంతో పగతో రగిలినా – గిన్నె నిండి పొర్లకుండునా        ||విడువడు||

548. Kanuchupu Meralona

నేనున్నా నీతో అంటూ
నా చెంతకు చేరావు
యేసయ్యా.. యేసయ్యా…
కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ
ఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు (2)
మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా
బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా (2)
పని పూర్తి చేయగ బలము లేని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు (2)
శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా
చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా (2)
స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా నోటను నూతన గీతం యేసూ పలికించావు (2)
కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా
సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా (2)
అడుగేసి సాగగ అనువుకాని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు (2)         ||కనుచూపు||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...