Wednesday, 22 May 2024

579. Viluve Leni Na Jivitham

విలువేలేని నా జీవితం, నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ జీవమును
నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే (2)

నీది శాశ్వత ప్రేమయ
నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన - మారదు.
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము - సాధ్యమే.... (2)

పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో. లేపితివే
రోగమే నన్ను చుట్టుకొని యుండగ
రోదనతో ఒంటరినై యుండగ
నా కన్నీటిని. తుడిచితివే (2) II నీది శాశ్వత II

పగలంతా మేఘస్తంభమై,
రాత్రంతా అగ్నిస్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పితివే....
స్నేహితులే నన్ను వదిలేసిన
బంధువులే భారమని తలచిన
నా కొరకే బలియైతివే. (2) II నీది శాశ్వత II

సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా యేసుకు సమస్తము
సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా ప్రియునికి సమస్తము (2)
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము - సాధ్యమే.... (2)
విలువేలేని నా జీవితం, నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే ధార బోసితివే .

Monday, 29 May 2023

578. Nenu Na Illu Na Intivarandarunu

నేను నా ఇంటి వారందరును
మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||

ఎడారిలో ఉన్న నా జీవితమును
మేళ్లతో నింపితివే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||

నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||

జ్ఞానుల మధ్యలో నను పిలిచిన
నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||

Monday, 6 February 2023

577. Na Hrudayamantha Neeve

నా హృదయమంతా నీవే
నా జీవితమంతా నీవే
నా రూపమంతా నీవే యేసు
నా ధ్యాన మంత నీవే క్రీస్తు

నా మార్గమును సరాళము - చేసే వాడవు నీవే
నా దు:ఖమును తుడిచేటి - స్నేహితుడవు నీవే
ఈ శూన్యమును వెలుగుగా - మార్చిన వాడవు నీవే
నా ప్రాణమును రక్షించే - నజరేయుడవు నీవే

నా యుద్దములొ ఖడ్గముగా - ఉండే వాడవు నీవే
నిరంతరం తోడుగా - మాకు ఉండే వాడవు నీవే
ఈ ఆత్మను శుద్దిగా - చేసినవాడవు నీవే
నీ ప్రేమతో నన్ను పిలిచిన - ప్రాణ ప్రియుడవు నీవే

576. Athi Parisudhuda Stuthi Nyvedyamu

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును (2)
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా

సర్వోన్నతమైన స్థలములయందు
నీ మహిమ వివరింపగా ఉన్నతమైన
నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2)
ముందెన్నడూ చవిచూడని
సరిక్రొత్తదైన ప్రేమామృతం (2)
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణం తీరదు ఏనాటికి (2)

సద్గుణరాశి నీ జాడలను నా యెదుట
నుంచుకొని గడిచిన కాలం
సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)
కృపవెంబడి కృపపొందగా – మారాను మధురముగా నే పొందగా (2)
నాలోన ఏ మంచి చూసావయ్యా
నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2)

సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక (2)
ఉన్నావులె ప్రతిక్షణమునా
కలిసి ఉన్నావులె ప్రతి అడుగున (2)
నీవేగా యేసయ్యా నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి (2)

575. Nee Pilupu Valana Nenu

నీ పిలుపు వలన నేను నశించిపోలేదు
నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటి లేదు (2)

నశించుటకు ఎందరో వేచియున్నను
నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను
ద్రోహము నిందల మధ్యలో నే నడచినను
నీ నిర్మల హస్తము నన్ను భరియించెను

యజమానుడా నా యజమానుడా…
నన్ను పిలచిన యజమానుడా
యజమానుడా నా యజమానుడా…
నన్ను నడిపించే యజమానుడా

మనుషులు మూసిన తలుపులు కొన్నైనను
నాకై నీవు తెరచినవి అనేకములు
మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను
నన్ను వెంటాడి నీ సేవను చేసితివి
నా ఆధారమా నా దైవమా
పిలిచిన ఈ పిలుపునకు కారణమా (2)

పిలిచిన నీవు నిజమైన వాడవు
నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు
ఏదేమైనను కొనసాగించితివి
నీపై ఆధారపడుటకు అర్హుడవు
నిన్ను నమ్మెదను వెంబడింతును
చిరకాలము నిన్నే సేవింతును 
(2)     

Monday, 10 October 2022

574. Thandri Deva Thandri Deva Na Sarvam Neevayya...

తండ్రి దేవా తండ్రి దేవా
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు
నా ప్రియుడా నా ప్రాణమా
నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా
నిన్ ఆరాధించెదన్

నీ ప్రేమ వర్ణించుట
నావల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట
నా బ్రతుకు చాలదయ్యా
తండ్రి దేవా నా ఆనందమా
నీ ఒడిలో నాకు సుఖము

నా ప్రాణ స్నేహితుడా
నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్న
నీ ప్రేమ మధురమయ్యా
తండ్రి దేవా నా ఆనందమా
నీ ఒడిలో నాకు సుఖము

573. Raja Ni Sannidhilo Nenuntanayya

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య – 2
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య – 2
నీవే లేకుండా నేనుండలేనయ్య – 2
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య – 2||
రాజా||

నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం – 2
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును – 2
నీవే రాకపోతే నేనేమైపోదునో – 2 ||నేనుండ||

ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా – 2
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు -2
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య- 2||నేనుండ||

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా -2
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము -2
నిన్ను మించిన దేవుడే లేడయ్య- 2 ||నేనుండ||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...