Wednesday, 17 July 2019

508. Sandehamela Samsayamadela Prabhu Yesu Gayamulanu


సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2)   
ముళ్ల మకుటము నీకైధరియించెనే
నీ పాప శిక్షను తానేభరియించెనే (2)
ప్రవహించె రక్త ధార నీ కోసమే
కడు ఘోర హింసనొందె నీ కోసమే (2)      
ఎందాక యేసుని నీవుఎరగనందువు
ఎందాక హృదయము బయటనిలవమందువు (2)
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2)
లోక భోగములనువీడజాలవా
సాతాను బంధకమందుసంతసింతువా (2)
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2)  
లోకాన ఎవ్వరు నీకైమరణించరు
నీ శిక్షలను భరియింపసహియించరు (2)
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2)   

507. Samipincharani Tejassulo Neevu Vasiyinchu Vadavaina


సమీపించరాని తేజస్సులో నీవు
వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు
నీ ప్రేమ వర్ణింప తరమా (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2)  ||సమీ||
ధరయందునేనుండ 
చెరయందు పడియుండ
కరమందు దాచితివే
నన్నే పరమున చేర్చితివే (2)
ఖలునకు కరుణను నొసగితివి (2)      
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2)  ||సమీ||
మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి
నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది (2)
తులువకు విలువను ఇచ్చినది (2)    
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2)    ||సమీ||

Wednesday, 3 July 2019

506. Siyonulo Nundi Neevu Prakasinchuchunnavu Napai


సీయోనులో నుండి నీవు  
ప్రకాశించుచున్నావు నాపై   
సమాధానమై - సదాకాలము నను నీతో  
నడిపించుచున్నావు నీకీర్తికై   
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా   
నిర్దోషమైన మార్గములో 
నా అంతరంగమున ధైర్యమునిచ్చి 
నీ సన్నిధిలో ననునిలిపి 
ఉన్నత విజయమునిచ్చితివి 
నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు 
విడువవు నను యెడబాయవు 
నీవు విడువవు నను యెడబాయవు 
నాయందు దృష్టినిలిపి 
నీస్నేహబంధముతో ఆకర్షించి 
కృపావరములతో ననునింపి 
సత్యసాక్షిగా మార్చితివి 
నీ మనస్సును పొందుకొని నీ ప్రేమను నింపుకొని 
కీర్తిoచెదను ప్రతినిత్యం 
నిను ఆరాధింతును అనుక్షణము
నీదివ్యమైన మహిమను
పరలోకమందునే చూచెదను 
నీ కౌగిలిలొ చేర్చుకొని
ప్రతిభాష్పబిందువును తుడిచెదవు 
నీ మాటల మకరందమును
మరపురాని అనుబంధమును 
మరువను ఎన్నడు విడువను 
నేను మరువను ఎన్నడు విడువను

505. Na Neethi Suryuda Bhuvinelu Yesayya

నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2)
రాజులకే......... మహారాజవు
కృపచూపే........ దేవుడవు
నడిపించే......... నజరేయుడా
కాపాడే........... కాపరివి (2)              ||నా నీతి||

శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను
వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2)
నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను
నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను
నీ మాటే మధురం
రాజులకే......... మహారాజవు
కృపచూపే........ దేవుడవు
నడిపించే......... నజరేయుడా
కాపాడే........... కాపరివి                  ||నా నీతి||

మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు నీవు
ఏదియు - కొదువ చేయవు - నిన్నాశ్రయించిన వారికి (2)
భీకరమైన కార్యములు - చేయుచున్నవాడా
సజీవుడవై - అధిక స్తోత్రము - పొందుచున్నవాడా
ఘనపరుతును నిన్నే
ప్రేమించే ..................యేసయ్యా
నీవుంటే ...................చాలునయా
నడిపించే ................. నజరేయుడా
కాపాడే .....................కాపరివి         ||నా నీతి||

సంఘమై - నీ స్వాస్థ్యమై - నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో - మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2)
వరములతో - ఫలములతో - నీకై బ్రతకాలని
తుదిశ్వాస - నీ సన్నిధిలో - విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా
కరుణించే.........యేసయ్యా
నీ కోసమే........ నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలయ్యా
నిను చూసే.......... ఆక్షణం. రావాలయ్యా ||నా నీతి||

504. Neeve Na Santhosha Ganamu Rakshna Srungamu

నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము 
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు ||నీవే||
లార్డ్! యు బి సేవియర్
షో మి సం మెర్సీ
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్
సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్
విల్ సరెండర్
యు ఆర్ మై కింగ్ గ్లోరి టు జీసస్
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు 
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో 
||నీవే||
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు 
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం         
||నీవే||
నిర్జీవమైన లోయయందు
జీవాధిపతివై వెలసినావు
దీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు 
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు         
||నీవే||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...