Wednesday, 17 July 2019

508. Sandehamela Samsayamadela Prabhu Yesu Gayamulanu


సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2)   
ముళ్ల మకుటము నీకైధరియించెనే
నీ పాప శిక్షను తానేభరియించెనే (2)
ప్రవహించె రక్త ధార నీ కోసమే
కడు ఘోర హింసనొందె నీ కోసమే (2)      
ఎందాక యేసుని నీవుఎరగనందువు
ఎందాక హృదయము బయటనిలవమందువు (2)
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2)
లోక భోగములనువీడజాలవా
సాతాను బంధకమందుసంతసింతువా (2)
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2)  
లోకాన ఎవ్వరు నీకైమరణించరు
నీ శిక్షలను భరియింపసహియించరు (2)
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2)   

No comments:

Post a Comment

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...