నా యేసు నాతో ఉండగా నేను భయపడను
నా క్రీస్తు నాలో ఉండగా ఎల్లప్పుడూ జయమే
ఆరాధనా నీకే ఆరాధనా నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే (2)
వ్యాధి బాధలలో నెమ్మదినిచ్చావు
శ్రమలలో నన్ను విడువని దేవుడవు
కృంగిన వేళలలో కన్నీరు తుడిచావు
అంగలార్పును నాట్యముగా మార్చావు
నీవే నా చేయి పట్టి నన్ను నడిపిన నా యేసయ్యా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే (2)
నిట్టూర్పులలో తోడుగా ఉన్నావు
అవమానమును ఘనతగ మార్చావు
పాపిని నన్ను పరిశుద్ధ పరిచావు
నన్ను నీ పాత్రగ మలిచావు
నీవు నాముందునడచి ననుబలపరిచిన నా యేసయ్యా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే (2)