About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons in Telugu and English. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.

Wednesday, 20 January 2021

Ghanamainavi Ni Karyamulu (Hosanna Songs) | Telugu Christian Song #558

ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళల
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే

ఏ తెగులు సమీపించనియ్యక
ఏ కీడైన దరి చేరనీయ్యక 
ఆపదలన్నీ తొలగేవరకు
ఆత్మలో నెమ్మది కలిగేవరకు
నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము

నాకు ఎత్తైన కోటవు నీవే
నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే
శాశ్వత కృప కాధారము నీవే
నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము

నీ కృప తప్ప వేరొకటి లేదయ
నీ మనసులో నేనుంటే చాలయ
బహు కాలముగా నేనున్న స్థితిలో 
నీ కృప నా యెడల చాలునంటివే
నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము

1 comment:

Netho Unte Jeevitham | Telugu Christian Song # 595

నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం (2) నువ్వే నా ప్రాణాధారము ఓ…. నువ్వే నా జీవాధారము (2) న...