Tuesday 2 August 2016

87. Stuthulaku Patrudu Yesayya

స్తుతులకు పాత్రుడు యేసయ్యా
స్తుతి కీర్తనలు నీకేనయ్యా
మహిమకు పాత్రుడు యేసయ్యా 
కీర్తియు ఘనతయు రాజునకే

        నే పాడెద ప్రభు సన్నిధిలో
నే ఆడెద ప్రభు సముఖములో
చిన్ని బిడ్డను పోలినే

స్తుతి చెల్లించెద యేసయ్యా
మహిమకు పాడ్రు యేసయ్యా

నిరతము పాడెద హల్లెలూయా
అల్ఫా ఓమెగయు నీవెనయ్యా

86. Stuthiyu Mahimayu Neke Kshithikin Divikin

స్తుతియు మహిమయు నీకే-క్షితికిన్‌ దివికిన్‌ నీటి-వితతికిన్‌ కర్తవై- వెలయు
మా దేవ = ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు-హితుడా మా ప్రేమ నీ -  కెట్లు చూపుదును

1. పసిడి వర్ణపుటెండ- భాగ్యధారల వాన - విసరు మంచిగాలి - విరియు
పుష్పములు = రసమొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్‌ చాటున్‌ - ప్రసరించు
కోతలో - ఫలనుందు వీవు

2. నెమ్మదిగల యిండ్లు-నిజ సౌఖ్య కాలములు-ఇమ్మహి ఫలియించు -
నైశ్వర్యాధికముల్‌ = ఇమ్ముగ గలిగిన - హృదయులమై వందనమ్ములు
ఋణపడి - యున్నాము నీకు

3. దురితంబు లొనరించి - దౌర్భాగ్యస్థితి నున్న - ధరణికి నీ పుత్రున్‌-
ధర్మంబుజేసి = నరుల కిధర్మమున - కొరత దీర్చెడు సర్వ - వరము
లమర్చిన - పరమోపకారి

4. జీవంబు ప్రేమను - జివను గల్గించెడు - పావనాత్మను మాకై పంపితివి =
    దీవెనలేడు రె - ా్లవరింపను మమ్ము - నీ విమలాత్మన్‌ మాలో గుమ్మరించు

5. నరులకు విమోచ - నముగల్గె పాపంబుల్‌-పరిహారమాయె గృ- పాసాధ
నములు = దొరికె మోక్షాంశము - స్థిరమాయె మేము నీ - కొరకేమి
తేగలము పరిపూర్ణ జనక

6. మాకై వాడుకొనెడి-రూకల్‌ వ్యర్ధంబగును-నీకై యప్పుగనిచ్చు-నిఖిల
వస్తువులు = శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధన నిధియై పై - లోకంబు నందుండు - లోపంబు లేక

7. జీవంబు వస్తువులు-శ్రేయస్సు దాన స్వ-భావంబు శక్తియు- భాగ్యంబులు =
        నీ వలననే లభ్యమై వెలయుచున్నవి-నీ వాసమే మాకు నిత్యానందంబు

85. Stuthiyu Mahima Ganatha nike

స్తుతియు మహిమ ఘనత నీకే 
యుగయుగముల వరకు ఎంతో
నమ్మదగిన దేవా

1. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము
మేమందరము ఉత్సహించి సంతోషించెదము
కొనియాడెదము మరువబడని మేలుల జేసెనని

2. నీ ఒక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు
నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము

3. నూతనముగ దినదినము నిలుచు నీదు వాత్సల్యత మాపై
ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు
ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా

4. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా
నడిపించెదవు సమభూమిగల ప్రదేశములో నన్ను

5. భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్‌
పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము

84. Stuthiyincheda Ni Namam Deva Anudinam

స్తుతియించెద నీ నామం - దేవా అనుదినం

1. దయతో కాపాడినావు - కృపనే చూపించినావు
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు

2. పాపినై యుండగ నేను - రక్షించి దరిచేర్చినావు
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు

3. సిలువే నాకు శరణం - నీవే నాకు మార్గం
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు

83. Stuthiyinchi kirthinthumu Ganaparachedamu

స్తుతియించి కీర్తింతుము ఘన పరచెదము
దేవ యెహోవా దేవ యెహోవా

1. మంటితో  మము నీ స్వరూపమందు సృజియించితివే స్వహస్తములతో
నీ జీవాత్మతో మమ్ముల నింపి
ఆశీర్వదించిన దేవ యెహోవా దేవ యెహోవా

 2. బయలు పరచు నీ సత్య మార్గములు పదిల పరచు నీ ఆత్మతో నెపుడు
మెలకువ కలిగి వెలుగువారమై
పూజింతుము నిను పూర్ణమనస్సుతో పూర్ణ మనస్సుతో

3. జీవిత యా తలో నీ నామమె సదా నడుపు మము తుది దినముల వరకును
తరుగని నీ కృప కమ్మరించి మము
దీవించుము మా దేవ యెహోవా దేవ యెహోవా

82. Stuthinchudi Yehova Devuni Surya Chandrulara

స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి 
ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి

1. కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా
ఆకాశ జలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను
మహా సముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా
ప్రశంసించుడి ఫలవృక్షములు
పరమ తండిని యెహోవాను స్తుతించుడి

2. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా
బాలురు యౌవ్వన కన్యక వృద్ధులు ప్రభుని స్తుతించుడి
ప్రాకుజీవులు పలువిధ పకక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు
పరమ తండిని యెహోవాను స్తుతించుడి

81. Stuthi Stuthi Stuthi Stuthi Stuthiki patruda

స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తుతికి పాత్రుడా
ప్రతిక్షణం దివిని దూత గణము పరమున
శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా
నేను కూడా చేరి నిన్‌ స్తుతింతు నేసువా

1. రాజువై రారాజువై ఆ... తండ్రితో
ఆ..సీనుడై మహిమ దేహంబుతో నుండగా
ధవళవస్త్ర తేజరాజ నా విమోచక
నేను కూడా చేరి నిన్‌ స్తుతింతు నేసువా

2. సిలువలో స్రవించినా నీ.. రక్తమే
నా.. హృదయము హిమము కంటె తెల్లగా మార్చెను
భక్తిపరుల కాశ్రయంబు నీదు పదములే
నేను కూడా చేరి నిన్‌ స్తుతింతు నేసువా

3. లోకము శరీరము సా..తానుడు
నా.. వైరులై నన్ను కవ్వించి మోసపుచ్చిన
కింపాప రీతి మమ్ము కాచియుింవి
నేను కూడా చేరి నిన్‌ స్తుతింతు నేసువా

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...