Tuesday, 2 August 2016

85. Stuthiyu Mahima Ganatha nike

స్తుతియు మహిమ ఘనత నీకే 
యుగయుగముల వరకు ఎంతో
నమ్మదగిన దేవా

1. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము
మేమందరము ఉత్సహించి సంతోషించెదము
కొనియాడెదము మరువబడని మేలుల జేసెనని

2. నీ ఒక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు
నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము

3. నూతనముగ దినదినము నిలుచు నీదు వాత్సల్యత మాపై
ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు
ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా

4. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా
నడిపించెదవు సమభూమిగల ప్రదేశములో నన్ను

5. భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్‌
పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము

No comments:

Post a Comment

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...