నాపైన చూపావు నీకనికరం కౌగిటిలో దాచావు గతవత్సరం స్తుతియించగా నిన్ను ఈ నా స్వరం బలపరచి నిలిపితివి ప్రతీ దినం కృప చూపావుగా నా యెడా ఇల నిలిపావు నా మనుగడ ఇక నీకొరకు నే బ్రతుకగా నాకు సరిపోయినా దేవుడా
యేసయ్య నా దేవా నీకె ఈ సంకీర్తన
మరుగొల్పు లోకములో నేనుండగా లోకేచ్చలనుమాయలో జారగా నీ కరము చాపి నను మరల లేపి ప్రియ సుతునిగా నన్ను నిలిపావుగ 2 పాపము బాపి సిలువ సాక్షిగా గతము మార్చావు నూతన సృష్టిగా 2 కృపా కనికరము గలిగినా దేవుడా నీ ప్రేమతో నను నిలిపినా నాథుడా 2
యేసయ్య నా దేవా నీకె ఈ సంకీర్తన
ఫలియించుటే తెలియనీ బ్రతుకుకు ఫలభరితముగ మారు కృపనిచ్చితివి పరిశుద్దాత్మ ద్వారా నను నీలో నిలిపి నీ ఆత్మ ఫలములతో నను నింపితివి 2 వాడబారని స్వాస్థ్యమే నా గురి అది పొందుటకు చేరితి నీ దరి 2 కృపా కనికరముగలిగినా దేవుడా నీ ఆత్మతో నను నింపినా నాథుడా. 2
యేసయ్య నా దేవా నీకె ఈ సంకీర్తన
సీయోను పురములో చూడాలి యుగయుగములు పరవసించాలని శ్రమలోన నీకొరకు నిలవాలనే పిలుపు నడిపించుచున్నది నను నిత్యము 2 బ్రతికెదను నేను నిసాక్షిగా విడిచెదను ప్రాణము హతసాక్షిగా ఈ ధరలో నేను కనుమూతును మహిమరాజ్యములో నిను దర్శింతును కృపా కనికరముగలిగినా దేవుడా నీ మహిమలో నను చేర్చు మహనీయుడ
యేసయ్య నా దేవా నీకె ఈ సంకీర్తన
