కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2) విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2) విడువడు నిన్ను
రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినా కాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునా ప్రాణమిచ్చి ప్రేమ పంచినా – పేరు పెట్టి నిన్ను పిలచినా నీ చేయి పట్టి విడచునా – అనాథగా నిన్ను చేయునా ||విడువడు||
అంధకారమడ్డు వచ్చినా – సంద్రమెంత ఎత్తు లేచినా నిరాశలే పలకరించినా – క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా బాధ కలుగు దేశమందునా – బంధకాలు ఊడకుండునా శత్రువెంతో పగతో రగిలినా – గిన్నె నిండి పొర్లకుండునా ||విడువడు||
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు యేసయ్యా.. యేసయ్యా…
కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు (2)
మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా (2) పని పూర్తి చేయగ బలము లేని వేళ (2) నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు (2)
శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా (2) స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ (2) నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోటను నూతన గీతం యేసూ పలికించావు (2)
కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా (2) అడుగేసి సాగగ అనువుకాని వేళ (2) నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు (2) ||కనుచూపు||
ఓ మానవా.. నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా (2) పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము (2) ||ఓ ||
ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును (2) ||ఓ ||
ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2) ||ఓ ||
వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా..
వేగిరమే వినుటకు రారండి ||వీనులకు||
రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
సృష్టి కర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా (2)
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
ఆరంభమయ్యింది రెస్టోరేషన్ నా జీవితంలోన న్యూ సెన్సేషన్ (2) నేను పోగొట్టుకున్నవన్ని నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇకముందు నా చేత చేయించులే మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్ రెండంతలు నాలుగంతలు అయిదంతలు ఏడంతలు నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్
మేం శ్రమనొందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్ఛును మా కంట కారిన ప్రతి బాష్ప బిందువు తన బుడ్డిలోన దాచుంచెను సాయంకాలమున ఏడ్పు వచ్చినను – ఉదయము కలుగును తోట నవ్వు పుట్టును – మాకు వెలుగు కలుగును దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు – మామ్మాదరించును కీడు తొలగజేయును – మేలు కలుగజేయును
మా పంట పొలముపై దందా యాత్ర చేసిన ఆ ముడతలను ప్రభువాపును చీడ పురుగులెన్నియో తిని పారువేసిన మా పంట మరలా మాకిచ్చును నా జనులు ఇక సిగ్గునొందరంటు – మా ప్రభువు చెప్పెను అది తప్పక జరుగును – కడవరి వర్షమొచ్చును క్రొత్త ద్రాక్షా రసము ఆహా మంచి ధాన్యములతో – మా కోట్లు నింపును క్రొత్త తైలమిచ్చ్చును – మా కొరత తీర్చును
పక్షి రాజు వలెను మా యవ్వనమును ప్రభు నిత్య నూతనం చేయును మేం కోల్పోయిన యవ్వన దినములను మరలా రెట్టింపుగా మాకిచ్చును అరె..వంద ఏళ్ళు అయినా మా బలము విరుగకుండా – సారమిచ్చును జీవ ఊటనిచ్చును జీవజలమునిచ్చును సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు – శక్తినిచ్చును ఆత్మ వాక్కునిచ్చును – మంచి పుష్టినిచ్చును
మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్లిన మా సొత్తు మాకు విడిపించును మోసకారి మోసము మేము తిప్పి కొట్టను ఆత్మ జ్ఞానముతో మేము నింపును అరె అంధకారమందు రహస్య స్థలములోని – మరుగైన ధనముతో మమ్ము గొప్ప చేయును – దొంగ దిమ్మ తిరుగును దొంగిలించలేని పరలోక ధనముతోటి – తృప్తిపరచును మహిమ కుమ్మరించును – మెప్పు ఘనతనిచ్చును
మా జీవితాలలో దైవ చిత్తమంతయు మేము చేయునట్లు కృపనిచ్చును సర్వ లోకమంతటా సిలువ వార్త చాటను గొప్ప ద్వారములు ప్రభు తెరచును అరె అపవాది క్రియలు మేం లయముచేయునట్లు – అభిషేకమిచ్చును ఆత్మ రోషమిచ్చును – క్రొత్త ఊపునిచ్చును మహిమ కలిగినట్టి పరిచర్యచేయునట్లు – దైవోక్తులిచ్చును సత్య బోధనిచ్చును – రాజ్య మర్మమిచ్చును