మనోహరుడా
పదివేలలో అతి సుందరుడా
మహావీరుడా
భువనాలనేలే బలశూరుడా
ఎంతని
నేను వివరించగలను
భువియందు
దివియందు నీ మహిమను
ఎవరిని
నీతో సరిపోల్చగలను
తలవంచి
స్తుతియించి కీర్తించగ
నిన్నే
ఆరాధించెదను - నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై
అభివాదము IIమనోహరుడాII
గోపరసమంత
సువాసన నీకే సొంతమైనది
అడవిలో
జల్దరు వృక్షముల అతికాంక్షనీయుడా
ఏన్గెది
ద్రాక్ష వనమందున - కర్పూర పుష్పాల సమానుడా
నాకెదురుగా
నీవు నిలిచావని
నిన్నే
ఆరాధించెదను - నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై
అభివాదము IIమనోహరుడాII
ఆరని మారని
ప్రేమను నాపై చూపినావు
వీడని
నీడగ నీ కృపను ధ్వజముగా నిలిపినావే
మోడైన
నా గోడు వినిపించగా - నా తోడుగా
నీవు నిలిచావుగా
నిన్నే
ఆరాధించెదను - నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై
అభివాదము IIమనోహరుడాII
కొండలు
మెట్టలు దాటుచూ - ప్రియుడేతెంచువేళ
పావుర
స్వరము దేశమున వినిపించుచున్నది
పైనుండి
శక్తిని పొందేందుకు నీ సన్నిధిలో నేనుందును
ఆనంద తైలముతో
నను నింపిన
నిన్నే
ఆరాధించెదను - నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై
అభివాదము IIమనోహరుడాII
పచ్చిక
బయల్లే నీవు నేను కలిసే చోటనీ నీ మందిరములో
ప్రతిదినము నే వేచియుందును
వనవాసాలెన్ని
అడ్డొచ్చినా - మానవాసమెపుడూ మారదులే
నా మార్గదర్శివి
నీవై నడిపించిన
నిన్నే
ఆరాధించెదను - నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై
అభివాదము IIమనోహరుడాII
No comments:
Post a Comment