నీ సన్నిధియే నాకు చాలయా
మేఘస్తంభమైన సన్నిధిని
రూపు మార్చగల సన్నిధిని (x2)
నడిపించే సన్నిధిని
నను వీడి పోనివ్వకు (x2)
బలహీనుడు బలవంతుడవునే
నీ సన్నిధి వచ్చుటచే
ఏమి లేకపోయినా నిండుగా ఉండెదన్
నీ సన్నిధిలో నేను
నీ సన్నిధియే నాకు చాలయా
నా హృదివాంఛ నీవెనయా (x2)
మన్నాను పక్షులను నీటిని అందించావు
అన్నియు అధికముగా ఉన్నవి (x2)
అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (x2)
నీవు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో
నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో (x2)
నీ సన్నిధియే నాకు చాలయా
నా హృదివాంఛ నీవెనయా (x2)
ఈ లోక అధికారం రాజ కిరీటము
తలపై మెరుస్తూ ఉంటున్నను (x2)
అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (x2)
నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో
నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో (x2)
నీ సన్నిధియే నాకు చాలయా
నా హృదివాంఛ నీవెనయా (x2)
అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (x2)
నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో
నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో (x2)
నీ సన్నిధియే నాకు చాలయా
నా హృదివాంఛ నీవెనయా (x2)
No comments:
Post a Comment