🎶 మేము పాడెదం 🎶
ప్రతి ఉదయం నీ కృపను
ప్రతి రాత్రి నీ వాత్సల్యతను
పగలంతా కీర్తింతుము
రేయంతా ఆరాదించెదము
అన్నికాలములలో - స్తోత్రార్హుడని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)
Eternal God
ఆరంభము నీవే - అంతముయు నీవే
ఉన్నవాడవు నీవే - అను వాడవు నీవే (2)
నిత్యమూ నివసించూ - దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)
Creator
ఆకాశము నీదే - అంతరిక్షము నీదే
జీవప్రాణులు నీవే - జలరాసులు నీవే (2)
సర్వమును సృజించిన - దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)
Redeemer
నీతిమంతుడు నీవే - నిత్యజీవము నీవే
పరిశుద్ధుడు నీవే - పరిహారము నీవే (2)
మా కొరకు బలియైన - దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)
Ruler
సంకల్పము నీదే - ఆలోచన నీదే
రాజ్యములు నీవే - రారాజువు నీవే (2)
సర్వాధికారియైన - దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)

No comments:
Post a Comment