Tuesday, 2 August 2016

94. Stothramul Stuthi Stothramul Veladi Vandanalu

స్తోత్రముల్‌ స్తుతి స్తోత్రముల్‌ వేలాది వందనాలు
కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడు స్తుతి స్తోత్రముల్‌ యేసయ్య

1. శూన్యము నుండి సమస్తము కలుగచేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను
యేసే నా సర్వము యేసే నా సమస్తము

2. పరము నుండి భువికి దిగివచ్చిన యేసు
సిలువ మరణమొంది మార్గము తెరచెను
యేసే నా రక్షణ యేసే నా నిరీక్షణ

93. Stothramu Stuthi Stothramu Chellinchudi

  స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడీ యేసుకే
రాజాధి రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు

1. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై
మహిలోన వెలసెను మరణించి లేచెను
మహిమ స్వరూపుడు (2)

2. పాపపు వస్త్రము మార్చి నీతిమంతునిగ తీర్చి
పరిశుద్ధులతో చేర్చి పరమ సౌభాగ్యము నిచ్చి
మహిమ స్వరూపుడు (2)

3. మేఘారూఢుడై మన ప్రభువు రానుండే
మహిమ శరీరముతో పరమున కేగెదము
మహిమ స్వరూపుడు (2)

92. Stothramu Cheyumu Srusti Karthaku

స్తోత్రము చేయుము సృష్టికర్తకు - ఓ దేవ నరుడా - స్తోత్రము చేయుము
సృష్టికర్తకు - స్తోత్రము చేయుము శుభకర - మతితో = ధాత్రికి గడువిడు - దయగల తండ్రికి

 1. పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమై - ఆపదవేళల - కడ్డము బెట్టక -
ఆపద మ్రొక్కులు - అవిగై చేయక = నీపై సత్‌కృప - జూపెడు తండ్రికి

 2. యేసుప్రభువుతో నెగిరిపోవభూ - వాసులు సిద్ధపడు నిమిత్తమై - ఈ
సమయంబున - ఎంతయు ఆత్మను = పోసి ఉద్రేకము - పొడమించు తండ్రికి

91. Stothram Yesu Stothram Yesu Raja

స్తోత్రం యేసు స్తోత్రం యేసురాజా
నేనెల్లప్పుడు పాడెద ||2|| (హల్లెలూయా)
నా జీవితకాలమంత నేనెల్లప్పుడు పాడెద ||2||

 1. స్తుతులకు పాత్రుడా - నేనెల్లప్పుడు పాడద

 2. మహిమకు పాత్రుడా - నేనెల్లప్పుడు పాడద

 3. స్తోత్రంలకు పాత్రుడా - నేనెల్లప్పుడు పాడద

 4. ఘనతకు పాత్రుడా - నేనెల్లప్పుడు పాడద

90. Stothram Chellinthumu Stuthi Stothram Chellinthumu

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసునాధుని మేలులు తలంచి

1. దివా రాత్రములు కంటి పాప వలె కాచి
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి

2. గాఢాంధకారములో కన్నీటి లోయలలో
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి

3. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి
సంపూర్ణ సిద్ధినొంద శుద్ధాత్మను ఒసగితివి

4. సీయోను మార్గములో పలు శోధనలు రాగా
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి

 5. సిలువను మోసికొని సువార్తను చేప్టి
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి

6. పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా
సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా

89. Stuthulu Stothramu Yesuke Chellinthunu

స్తుతులు స్తోత్రము యేసుకే చెల్లింతును
మహిమ ఘనతలు నీకే ఎల్లప్పుడు
హల్లెలూయ హోసన్నా - హల్లెలూయ హోసన్నా

1. నశించిపోతున్న మనకొరకు మరియ గర్భమున జన్మించెన్‌
పాపులైన మనకొరకు ఘోరసిలువపై మరణించెను
మరణము జయించి లేచెను లోకమును రక్షించెను

2. కానా విందులో నీిని ద్రాక్షరసముగా చేసెను
ఆకలైతే ఎడారిలో మన్నా కురిపించెను
చనిపోయిన లాజరును మాటతో బ్రతికించెను

88. Stuthulu Ghana Samsthutulu Nike Mathilona Thandri

స్తుతులు ఘనసంస్తుతులు నీకే మతిలో నా తండ్రీ
ప్రతివిషయ ప్రార్ధన సమయంబును కృతజ్ఞతా స్తోత్రము తండ్రి

1. ప్రసవ వేదన ప్రార్ధన చేయు వాలిమ్ము తండ్రీ
విసుపైన విజ్ఞాపన ప్రార్ధన - నేర్పు ప్రసాదించుము తండ్రీ

2. ఆ స్థితియుంచుము నెరవేరు పర్యంతము నాతండ్రీ
దుస్థితి పోవుట భాగ్యములన్నిట - దొడ్డ భాగ్యమే నా తండ్రీ

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...