Tuesday, 2 August 2016

90. Stothram Chellinthumu Stuthi Stothram Chellinthumu

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసునాధుని మేలులు తలంచి

1. దివా రాత్రములు కంటి పాప వలె కాచి
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి

2. గాఢాంధకారములో కన్నీటి లోయలలో
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి

3. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి
సంపూర్ణ సిద్ధినొంద శుద్ధాత్మను ఒసగితివి

4. సీయోను మార్గములో పలు శోధనలు రాగా
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి

 5. సిలువను మోసికొని సువార్తను చేప్టి
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి

6. పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా
సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా

No comments:

Post a Comment

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...