Friday, 5 August 2016

131. Lokamantha Thirigi Vachina Nilanti Thandri Ledayya

లోకమంత తిరిగి వచ్చినా - నీలాంటి తండ్రి లేడయ్యా
కరుణామయుడా యేసు కరుణామయుడ
జీవితాంతము సేవింతును నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన

అబ్రహాము దేవుడ నీకే ఆరాధన
ఇస్సాకు దేవుడ నీకే ఆరాధన
యాకోబు దేవుడా నీకే ఆరాధన - ఆరాధన
తండ్రి కుమారుడా పరిశుద్ధాత్ముడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ||లోకమంత||

హృదయమంతా నీదు జ్ఞాపకం - నీవు తప్ప వేరే లేదయ్యా
లోకమంతా తిరిగి వచ్చినా నీలాంటి తండ్రి లేడయ్యా
ప్రేమామయుడా యేసు ప్రేమా మయుడా
జీవితాంతము సేవింతును నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ||లోకమంత||

నీలో నన్ను దాచినావు - నాలో నిన్ను చూడాలేసయ్యా
నా కొరకే ప్రాణమిచ్చితివి - నీ సాక్షిగ ఉంటానేసయ్య
కృపామయుడా యేసు కృపా మయుడా
రక్షణ పాత్ర చేత పట్టి చేసెద ఆరాధనా ||లోకమంత||

130. Raja Ni Bhavanamulo Reyi Pagalu Vechi Yundunu

రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును 
స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను
ఆరాధన.. ఆరాధన.. అబ్బా తండ్రీ నీకేనాయ్యా...

నా బలమా నా కోట ఆరాధనా నీకే
నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే
ఆరాధన.. ఆరాధన.. అబ్బా తండ్రీ నీకేనాయ్యా...

అంతట నివసించు యెహోవా ఎలోహిమ్‌ ఆరాధనా నీకే
నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే
ఆరాధన.. ఆరాధన.. అబ్బా తండ్రీ నీకేనాయ్యా...

పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదేస్‌ ఆరాధనా నీకే
రూపించు దైవం యెహోవా ఓస్సేను ఆరాధనా నీకే
ఆరాధన.. ఆరాధన.. అబ్బా తండ్రీ నీకేనాయ్యా...

129. Yese Na Parihari Priya Yese Na

యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి
నా జీవితకాలమెల్ల - ప్రియ ప్రభువే నా పరిహారి

ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించె బాధలెన్నో
ఎన్ని నష్టాలు వాటిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి

నన్ను సాతాను వెంబడించిన - నన్ను శత్రువు ఎదిరించిన
పలు నిందలు నను చుట్టినా - ప్రియ ప్రభువే నా పరిహారి

మణి మాణ్యాలు లేకున్న - మనో వేదనలు వేదించిన
నరులెల్లరు నను విడిచిన - ప్రియ ప్రభువే నా పరిహారి

బహు వ్యాధులు నను సోకిన - నాకు శాంతి కరువైన
నను శోధకుడు శోధించిన - ప్రియ ప్రభువే నా పరిహారి

దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు
నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను

128. Yesayya Namamlo Sakthi Unnadayya

యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని

పాపాలను క్షమియించే శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం

రోగికి స్వస్థత నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము
మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం

దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం

సృష్టిని శాసించగల్గిన శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లేపగల్గిన శక్తి కలిగినది యేసయ్య నామం

పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం

127. Mahimaku Patruda... Mahonnathuda Adbhuthalu Cheyuvada

మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము ||2||
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటివారు ఎవరు నీవంటివారు లేరు ||2||

స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం
నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటివారు ఎవరు నీవంటివారు లేరు ||2||

అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
మా కరములను జోడించి నిను మహిమ పరచెదం
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటివారు ఎవరు నీవంటివారు లేరు ||2||

126. Mahima Nike Prabhu Ganatha Nike Prabhu

మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు 
స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకె ప్రభూ
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ప్రియ యేసు ప్ర్రభునికే నా యేసు ప్రభునికే

సమీపించరాని తేజస్సునందు వశియించు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ప్రియ యేసు ప్ర్రభునికే నా యేసు ప్రభునికే

ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి ప్రాణమునర్పించితివే
విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ప్రియ యేసు ప్ర్రభునికే నా యేసు ప్రభునికే

ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నను పిలిచి వెలిగించితివే
నీ గుణాతిశయములు ధర నే ప్రచురింప ఏర్పరచుకొంటివే
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ప్రియ యేసు ప్ర్రభునికే నా యేసు ప్రభునికే

125. Mahima Ghanathaku Arhudavu Nive Na Daivamu

మహిమ ఘనతకు అర్హుడవు - నీవె నా దైవము
సృష్టికర్త ముక్తిదాత (2) మా స్తుతులకు పాత్రుడ...
ఆరాధన నీకే - ఆరాధన నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన నీకే - ఆరాధన నీకే

మన్నాను కురిపించినావు
బండనుండి నీళ్ళిచ్చినావు
యెహోవా యీరే - చూచుకొనును (2)
సర్వము సమకూర్చును
ఆరాధన నీకే - ఆరాధన నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన నీకే - ఆరాధన నీకే

వ్యాధులను తొలగించినావు
మృతులను మరి లేపినావు
యెహోవా రాఫా - స్వస్థపరచును (2)
నను స్వస్థపరచును
ఆరాధన నీకే - ఆరాధన నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన నీకే - ఆరాధన నీకే

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...