Friday, 5 August 2016

129. Yese Na Parihari Priya Yese Na

యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి
నా జీవితకాలమెల్ల - ప్రియ ప్రభువే నా పరిహారి

ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించె బాధలెన్నో
ఎన్ని నష్టాలు వాటిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి

నన్ను సాతాను వెంబడించిన - నన్ను శత్రువు ఎదిరించిన
పలు నిందలు నను చుట్టినా - ప్రియ ప్రభువే నా పరిహారి

మణి మాణ్యాలు లేకున్న - మనో వేదనలు వేదించిన
నరులెల్లరు నను విడిచిన - ప్రియ ప్రభువే నా పరిహారి

బహు వ్యాధులు నను సోకిన - నాకు శాంతి కరువైన
నను శోధకుడు శోధించిన - ప్రియ ప్రభువే నా పరిహారి

దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు
నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను

No comments:

Post a Comment

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.