Saturday, 6 August 2016

149. Parthi Dinamu Nivichina Bahumaname

ప్రతి దినము నీవిచ్చిన బహుమానమే
ప్రభువా ప్రతి క్షణము నిన్నే స్తుతియించెద

వ్యాధి బాధలెన్నో నన్ను చుట్టినా
నీ గాయపడిన హస్తముతో నను ముట్టినావు
(నేను) ఈ దినమున ఉన్నట్టుగా
సజీవునిగా నను నిలిపావు

నా మనసు కృంగి వేదనలో నేనుండగా
నా చెంత చేరావు నీవు నా అండగా
(నన్ను) ఆదరించి బలపరిచావు
నీ కృపలో నను నిలిపావు

148. Nivu Chesina Upakaramulaku Nenemi

నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును
ఏడాది కోడెలనా వేలాది పొట్టేళ్లనా

వేలాది నదలంత విస్తార తైలము - నీకిచ్చినా చాలునా
గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని - నీకిచ్చినా చాలునా

మరణ పాత్రుడ నైయున్న నాకై - మరణించితివా సిల్వలో
కరుణ చూపి నీ జీవమార్గాన - నడిపించుమో యేసయ్యా

విరిగి నలిగిన బలియాగముగను - నా హృదయమర్పింతును
రక్షణ పాత్రను చేబూని నిత్యము - నిను వెంబడించెదను

147. Ni Dayalo Ni Krupalo Kachithivi

నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము
నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము
నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా
దేవా… దేవా…           ||నీ దయ||

కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా
ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2)
ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు
నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2)
ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా
నీవె నా మార్గము – నీవె నా జీవము
నీవె నా గమ్యము – నీవె నా సర్వము
నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా   ||నీ దయ||

ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి
వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2)
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని
నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2)
నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం
నీవె నా తోడుగా – నీవె నా నీడగా
ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా
నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ||

146. Nadu Jivithamu Maripoyinadi

నాదు జీవితము మారిపొయినది
నిన్నాశ్రయించిన వేళ
నన్నాదుకొంటివి ప్రభువా          ||నాదు||

చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2)
పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..      ||నాదు||

కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2)
నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..      ||నాదు||

లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే (2)
ఆ దారి నడవక నన్ను – కాపాడినావని దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..        ||నాదు||

జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా (2)
చేరగల నీ దరికి –  పాపినయ్యా ప్రభువా
నే పాపినయ్యా ప్రభువా..         ||నాదు||

ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై (2)
ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి
నన్నెంతగా ప్రేమించితివి..         ||నాదు||

Friday, 5 August 2016

145. Nakenno Melulu Chesithivi Nikemo Arpinthunu

నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి  అర్పింతును – దేవా నీకేమి చెల్లింతును (2)
హల్లెలూయా యేసునాథా–కృతజ్ఞతా స్తుతులివే (2)  

కృప చేత నన్ను రక్షించినావే
కృప వెంబడి కృపతో – నను బలపరచితివే
నన్నెంతగానో ప్రేమించినావే
నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే (2)  ||హల్లె||

నా జీవితాశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే (2) ||హల్లె||

నా కాడి మోసి నా తోడు నీవే
నీ చేతి నీడలో – నను దాచియున్నావే
ఏ కీడు నాకు రాకుండ చేసి
నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2)    ||హల్లె||

నీ రాజ్యమందు నను చేర్చుకొందువు
రానున్న రారాజువు – నా రాజువు నీవు
నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు
నను కొన్నవాడవు – నా వరుడవు నీవు (2) ||హల్లె||

144. Na Nithi Nive Na Khyathi Nive

నా నీతి నీవే నా ఖ్యాతి నీవే
నా దైవమా యేసయ్యా
నా క్రియలు కాదు నీ కృపయే దేవా
నా ప్రాణమా యేసయ్యా
నదులంత తైలం విస్తార బలులు
నీకిచ్చినా చాలవయ్యా
నీ జీవితాన్నే నాకిచ్చినావు
నీకే నా జీవమయ్యా
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (4)       ||నా నీతి||

నా దీన స్థితిని గమనించి నీవు
దాసునిగ వచ్చావుగా
నా దోష శిక్ష భరియించి నీవు
నను నీలో దాచావుగా
ఏమంత ప్రేమ నా మీద నీకు
నీ ప్రాణమిచ్చావుగా
నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను
యజమానుడవు నీవేగా                         ||హల్లెలూయ||

నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు
నీవు చేరదీసావుగా
నా ప్రక్క నిలిచి నను ధైర్యపరచి
కన్నీరు తుడిచావుగా
నేనున్న నీకు భయమేలనంటూ
ఓదార్పునిచ్చావుగా
చాలయ్య దేవ నీ కృపయే నాకు
బ్రతుకంతయు పండుగా                          ||హల్లెలూయ||

ఆ ఊభిలోనా నే చిక్కినప్పుడు
నీవు నన్ను చూసావుగా
నీ చేయి చాపి నను పైకి లేపి
నీ వాక్కునిచ్చావుగా
నా సంకటములు నా ఋణపు గిరులు
అన్నిటిని తీర్చావుగా
నీలోన నాకు నవ జీవమిచ్చి
నీ సాక్షిగా నిలిపావుగా                          ||హల్లెలూయ||

143. Na Kanula Vembadi Kanniru Raniyaka

నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా ముఖములో దుఖమే ఉండనీయక

చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2)
ఆరాధనా ఆరాధనా నీకే (4)                      ||నా కనుల||

అవమానాలను ఆశీర్వాదముగా
నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2)
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2)      ||చిరు||

సంతృప్తి లేని నా జీవితములో
సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2)
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2)  ||చిరు||


585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...