నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి అర్పింతును – దేవా నీకేమి చెల్లింతును (2)
హల్లెలూయా యేసునాథా–కృతజ్ఞతా స్తుతులివే (2)
కృప చేత నన్ను రక్షించినావే
కృప వెంబడి కృపతో – నను బలపరచితివే
నన్నెంతగానో ప్రేమించినావే
నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే (2) ||హల్లె||
నా జీవితాశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే (2) ||హల్లె||
నా కాడి మోసి నా తోడు నీవే
నీ చేతి నీడలో – నను దాచియున్నావే
ఏ కీడు నాకు రాకుండ చేసి
నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2) ||హల్లె||
నీ రాజ్యమందు నను చేర్చుకొందువు
రానున్న రారాజువు – నా రాజువు నీవు
నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు
నను కొన్నవాడవు – నా వరుడవు నీవు (2) ||హల్లె||
Wonderful Thanksgiving song in humility
ReplyDeleteThank you very much for publishing this song
ReplyDelete