Saturday, 6 August 2016

159. Chalunaya Deva Chalunaya Napai Ni Premaye

చాలునయా దేవా చాలునయా - నాపై నీ ప్రేమయే చాలును
మరువలేనయ్యా మరచిపోనయ్యా - నాపై నీకున్న ఈ ప్రేమను
విడవలేనయ్యా విడిచిపోనయ్యా

కాలాలు మారిన మారిపోని నీప్రేమ - తరాలు తరిగినా తరిగిపోని నీ
ప్రేమ నను కన్నవారే నన్నె మరచినా - స్నేహితులే నను వెలివేసినా
విడువని ప్రేమతో నన్నావరించి - అక్కున చేర్చుకొని ఆదరించావయా..

పాపపు ఊబిలో పడియుండగా - నీ ప్రేమతో నను కనుగొన్నావయ్యా
సిలువప్రేమతో నా దరిచేరి - నా చేయిప్టి నన్ను లేపావయ్యా
నా పాపములన్ని నీవు కడిగి - పరిశుద్ధునిగా నను చేశావయ్యా

కాలాలు మరినా క్షామమే ప్రబలినా - కోరినవి దూరమైన ఖడ్గమే ఎదురైనా
కలువరివైపే నే సాగెదన్‌ - కలువరినాధా నిన్నే కొలిచెదను
చిరకాలము నిన్నారాధింతున్‌ - భజియించి కీర్తించి స్తుతియింతును

158. Kalvari Prema Nannu Kadigina Prema

కలువరి ప్రేమ నన్ను కడిగిన ప్రేమ

కఠినమైన నన్ను కరుణించిన ప్రేమ

నా పాపముకై భువికరుదెంచిన ప్రేమ
నా శాపముకై సిలువ వేయబడిన ప్రేమ
నా దోషముకై చీల్చబడిన ప్రేమ
నా శాపముకై తలవంచిన ప్రేమ
నా యేసుని ప్రేమ నా దేవుని ప్రేమ

నేను మరచినా నన్ను మరువని ప్రేమ
నా మార్గంలో నాతో నడచిన ప్రేమ
కృంగిన నన్ను బలపరచిన ప్రేమ
పడిపోయిన నన్ను లేవనెత్తిన ప్రేమ
నా యేసుని ప్రేమ నా దేవుని ప్రేమ


157. O Yesu Ni Prema Entho Mahaniyamu

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ ||

అగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు  ఆఆ...                ||ఓ యేసు||

సంకట సమయములో సాగలేకున్నాను
దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా
వింటినంటివి నా మొర్రకు ముందే
తోడునుందునంటివి ఆఆ...               ||ఓ యేసు||

కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తి పరచుచు
నాతో నుండునేసు ఆఆ...                ||ఓ యేసు||

దేవుని గృహములో సదా స్తుతించెదనూ
సంపూర్ణ హృదయముతో సదా భజించెదను
స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు
హల్లేలూయా ఆమేన్ ఆఆ...                ||ఓ యేసు||


156. Enduko Nanninthaga Nivu Preminchithivo Deva

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)

నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే (2)         ||ఎందుకో||

నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుచున్నాను
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో (2)           ||ఎందుకో||

నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు (2)       ||ఎందుకో|| 

నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సంతసము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే (2)        ||ఎందుకో||

నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్ (2)             ||ఎందుకో||


155. Entha Madhuramu Yesuni Prema

ఎంత మధురము యేసుని ప్రేమ
ఎంత మధురము నా యేసుని ప్రేమ (2)
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2)       ||ఎంత మధురము||

అంధకార బంధము నన్నావరించగా
అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2)
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను (2)          ||ప్రేమా||

రక్షించు వారు లేక పక్షినైతిని
భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2)
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను (2)          ||ప్రేమా||

ఎన్నో పాపములు చేసి మూట కడితిని

ఎన్నో మోసములు చేసి
దోషినైతిని బంధము తెంచెను

బ్రతికించెను నన్ను                  ||ప్రేమా||


కుష్టు బ్రతుకు నై నేను కృంగియుండగా

భ్రష్టునైన  నన్ను బ్రతికించెనుగా

బంధము తెంచెను

బ్రతికించెను నన్ను                 ||ప్రేమా|| 

154. Entha Jali Yesuva

ఎంత జాలి యేసువా
యింతయని యూహించలేను     ||ఎంత||

హానికరుడ హింసకుడను
దేవదూషకుడను నేను (2)
అవిశ్వాసినైన నన్ను (2)
ఆదరించినావుగా     ||ఎంత||

రక్షకుండ నాకు బదులు
శిక్ష ననుభవించినావు (2)
సిలువయందు సొమ్మసిల్లి (2)
చావొందితివి నాకై     ||ఎంత||

ఏమి నీ కర్పించగలను
ఏమి లేమి వాడనయ్యా (2)
రక్షణంపు పాత్రనెత్తి (2)
స్తొత్రమంచు పాడెద     ||ఎంత||

నీదు నామమునకు యిలలో
భయపడెడు వారి కొరకై (2)
నాథుడా నీ విచ్చు మేలు (2)
ఎంత గొప్పదేసువా     ||ఎంత||

నేను బ్రతుకు దినములన్ని
క్షేమమెల్ల వేళలందు (2)
నిశ్చయముగ నీవు నాకు (2)
ఇచ్చువాడా ప్రభువా     ||ఎంత||

నాదు ప్రాణమునకు ప్రభువా
సేద దీర్చు వాడ వీవు (2)
నాదు కాపరివి నీవు (2)
నాకు లేమి లేదుగా     ||ఎంత||

అందరిలో అతి శ్రేష్ఠుండా
అద్వితీయుడగు యేసయ్యా (2)
హల్లెలూయ స్తోత్రములను (2)
హర్షముతో పాడెద     ||ఎంత||



153. Ascharyamaina Prema Kalvariloni Prema

ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ (2)   

పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే  

పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే 

శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు   

నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే 

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...