యేసుని ప్రజలు బలవంతులు
వెంబడించువారు శక్తిమంతులు
కుంటివారికి నడకనిచ్చెను
గ్రుడ్డివారికి చూపునిచ్చెను
సంతోషముతో గంతులు వేయుచు
యేసుని ప్రేమలో సాగెదన్
మూగవారికి మాటనిచ్చెను
చెవిటివారికి చెవులనిచ్చెను
ఉత్సాహముతో ఉరకలు వేయుచు
యేసుని ప్రేమలో సాగెదన్
పడినవారిని లేవనెత్తెను
చెడినవారిని చేరదీసెను
ఆనందముతో ఆరాధించుచు
యేసుని ప్రేమలో సాగెదన్
మరణం నుండి లేవనెత్తెను
బలహీనులను బలపరచెను
సంగీతముతో నాట్యము చేయుచు
యేసుని ప్రేమలో సాగెదన్