Wednesday, 10 August 2016

194. Na Jivam Ni Krupalo Dachithive

నా జీవం నీ కృపలో దాచితివే
నా జీవిత కాలమంతా
ప్రభువా నీవే నా ఆశ్రయం
నా ఆశ్రయం         ||నా జీవం||

పాపపు ఊబిలో పడి కృంగిన నాకు
నిత్య జీవమిచ్చితివే (2)
పావురము వలె నీ సన్నిధిలో
జీవింప పిలచితివే (2)                   ||నా జీవం||

ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము
అడ్డురానే వచ్చెనే (2)
నీ బాహు బలమే నన్ను దాటించి
శత్రువునే కూల్చెనే (2)           ||నా జీవం||

కానాను యాత్రలో యొర్దాను అలలచే
కలత చెందితినే (2)
కాపరివైన నీవు దహించు అగ్నిగా
నా ముందు నడచితివే (2)     ||నా జీవం||

వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము
నన్ను వెంటాడెనే (2)
వాక్యమైయున్న నీ సహవాసము
ధైర్యము పుట్టించెనే (2)       ||నా జీవం||

స్తుతుల మధ్యలో నివసించువాడా
స్తుతికి పాత్రుడా (2)
స్తుతి యాగముగా నీ సేవలో
ప్రాణార్పణ చేతునే (2)       ||నా జీవం||

193. Chalunaya Chalunaya Ni Krupa Naku Chalunaya

చాలునయా చాలనయా
నీ కృప నాకు చాలునయ్యా (2)
ప్రేమామయుడివై ప్రేమించావు
కరుణామయుడివై కరుణించావు (2)
తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించి (2)
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)          ||చాలునయ్యా||

జిగటగల ఊభిలో పడియుండగా
నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా
హిమము కంటెను తెల్లగ మార్చయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా
నా జీవితమంతా అర్పింతు నీకయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)      ||చాలునయ్యా||

బంధువులు స్నేహితులు త్రోసేసినా
తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
నన్ను నీవు విడువనే లేదయ్యా
మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా
నీ సాక్షిగా నేను ఇల జీవింతునయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)        ||చాలునయ్యా||

192. Krupalanu Thalanchuchu

కృపలను తలంచుచు ||2||
ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ||2||..

కన్నీటి లోయలలో - నే కృంగిన వేళలలో
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం..

రూపింపబడుచున్న - యే ఆయుధముండినను
నాకు విరోధమై వర్ధిల్లదుయని
చెప్పిన మాట సత్యం యేసు చెప్పి మాట సత్యం..

హల్లెలూయా ఆమేన్‌ - హా! నాకెంతో ఆనందమే
సీయోను నివాసం నాకెంతో ఆనందం
ఆదనందమానందమే ఆమెన్‌ ఆనందమానందమే

191. Krupa vembadi krupatho nanu preminchina

కృప వెంబడి కృపతో
నను ప్రేమించిన నా యేసయ్యా
నను ప్రేమించిన నా యేసయ్యా (2)
నను కరుణించిన నా యేసయ్యా (2)         ||కృప||

నా యెడల నీకున్న తలంపులు
బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా (2)
అవి వర్ణించలేను నా యేసయ్యా
అవి వివరింపలేను నా యేసయ్యా (2)
నా యెడల నీకున్న వాంఛలన్నియు            ||కృప||

ఎన్నో దినములు నిన్ను నే విడచితిని
ఎన్నో దినములు నిన్ను నే మరచితిని (2)
విడువని ఎడబాయని నా యేసయ్యా
మరువక ప్రేమించిన నా యేసయ్యా (2)
ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా           ||కృప|

190. Krupa thappa Verokati ledaya

కృపతప్ప వేరొకటి లేదయా నీ కృపతప్ప వేరెవరు యేసయ్యా
కృపయే కదా నా ఆశ్రయము - నీ కృపయే కదా నా పరవశము

నీ కృప నన్ను విడువనిదీ నీ కృపయే ఎడబాయనిది
నిరంతరము నిలుచును నీ కృపయే

అణువణువునను నీ కృపయే నా అడుగడుగునను నీ కృపయే
నిత్యము నిలుచును నీ కృపయే

నిలువున రేగిన తుఫానులో నిలిపెను నడిపెను నీ కృపయే
నా ఎడ చెలరేగె నీ కృపయే

189. Krupa Chalunu Ni Krupa Chalunu

కృప చాలును నీ కృప చాలును
కలిమిలో ఉన్నను వేదనలో ఉన్నను
కృప చాలును నీ కృప చాలును

అవమాన నిందలు నన్ను వెంబడించినను
నీకృప నను విడిపించున్ యేసయ్య నీకృప నను హెచ్చించున్

ఎఱ్ఱ సంద్రము ఎదురై నిలిచినను
నీకృప నను విడిపించున్ యేసయ్య నీకృప నను నడిపించున్

కన్నీటి సమయము వేదన బాధలలో
నీకృప నను విడిపించున్ యేసయ్య నీకృప ఆదరించున్

188. Krupa Krupa Ni Krupa

కృపా కృపా నీ కృపా - కృపా కృపా క్రీస్తు కృపా
నేనైతే నీ కృపయందు - నమ్మికయుంచి యున్నాను.. ఆ..

కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను
నీ సన్నిధిలో నిర్ధోషముతో నేను నడిచెదను
నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ

దీనదశలో నేనున్నపుడు నను మరువనిది నీ కృపా
నేనీస్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప
నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...