Wednesday, 10 August 2016

187. Sadakalamu Nitho Nenu Jivinchedanu

సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

1. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా
ఏ తోడులేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా  
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

2. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్య
ఆశ్చర్యకార్యములు ఎన్నోచేసి నీ పాత్రగా నన్ను మలిచావయా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

186. Vendi Bangarala kanna Minnayainadi Yesu Prema

వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరూ చూపలేని ప్రేమ
యేసు ప్రేమ శాశ్వత ప్రేమ హల్లెలూయ - మహాదానందమే

1. లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించినప్రేమ
లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ

2. ఏ స్థితికైన చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ
నీకు బదులు మరణించిన ప్రేమ చిరజీవము నీ కొసగిన ప్రేమ (2) యేసు ప్రేమ......

185. Yesuni Premanu Nemarakanu

యేసుని ప్రేమను నేమారకను
నెప్పుడు దలచవే యో మనసా
వాసిగ నాతని వర నామంబును
వదలక పొగడవె యో మనసా

పాపుల కొరకై ప్రాణం బెట్టిన
ప్రభునిల దలచవె యో మనసా
శాపమ నంతయు జక్కగ నోర్చిన
శాంతుని పొగడవె యో మనసా

కష్టములలో మన కండగ నుండి
కర్తను దలచవె యో మనసా
నష్టము లన్నియు నణచిన యాగురు
శ్రేష్ఠుని పొగడవె యో మనసా

మరణతఱిని మన శరణుగ నుండెడు
మాన్యుని దలచవె యో మనసా
కరుణను మన కన్నీటిని దుడిచిన
కర్తను పొగడవె యో మనసా

ప్రార్ధనలు విని ఫలముల నొసగిన  
ప్రభునిక దలచవె యో మనసా
వర్ధన గోరుచు శ్రద్ధతో దిద్దిన
వంద్యుని పొగడవె యో మనసా

వంచనలేక వరముల నొసగిన  
వరదుని దలచవె యో మనసా
కొంచము కాని కూర్మితో దేవుని
కొమరుని పొగడవె యో మనసా

184. Yesuni Prajalu Balavanthulu

యేసుని ప్రజలు బలవంతులు
వెంబడించువారు శక్తిమంతులు

కుంటివారికి నడకనిచ్చెను
గ్రుడ్డివారికి చూపునిచ్చెను
సంతోషముతో గంతులు వేయుచు
యేసుని ప్రేమలో సాగెదన్

మూగవారికి మాటనిచ్చెను
చెవిటివారికి చెవులనిచ్చెను
ఉత్సాహముతో ఉరకలు వేయుచు
యేసుని ప్రేమలో సాగెదన్

పడినవారిని లేవనెత్తెను
చెడినవారిని చేరదీసెను
ఆనందముతో ఆరాధించుచు
యేసుని ప్రేమలో సాగెదన్

మరణం నుండి లేవనెత్తెను  
బలహీనులను బలపరచెను
సంగీతముతో నాట్యము చేయుచు
యేసుని ప్రేమలో సాగెదన్

183. Maranidi Maruvanidi Viduvanidi Edabayanidi

మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ||2||
ప్రేమా యేసయ్య ప్రేమా ||4||

నేను మరచిన గాని నన్ను మరవనన్న ప్రేమా
నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమా ||2||
నేను పడిపోతుంటే నన్ను పట్టుకున్న ప్రేమా
తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమా ||2||

తల్లి మరచిన గాని నన్ను మరవనన్ను ప్రేమా
తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమా ||2||
నేను ఏడుస్తుంటే నన్ను ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమా ||2||

నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమా
నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమా ||2||
అరచేతుల్లో నన్ను చెక్కుకున్న ప్రేమా
ఎద లోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా ||2||

182. Maruvalenu Maruvalenu Maruvalenayya

మరువలేను - మరువలేను - మరువలేనయ్యా
నీ ప్రేమ చరితం ఆ ఘోర మరణం
యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా
దయామయా ఓ.. ఓ.. ఓ..

బలిపశువుగా నా పాపము కొరకై - బలియై పోతివయ్యా
నోరు తెరువక భారపు సిలువను - భరియించి ఓర్చితివా
నాకై భారము మోసితివా

పంచగాయములలో - కారుచున్న రుధిరం
నిను ముంచివేసెనయ్యా దోషరహితుడా హేతువు లేక
నిను ద్వేషించిరయ్యా - పగబట్టి చంపిరయ్యా

ఏ దరిగానక - తిరిగిన నన్ను - నీ దరి చేర్చితివా
మార్గము నీవై సత్యము నీవై - జీవము నీవైతివి
నా సర్వము నీవైతి

181. Marapurani Ni Premanu Ne

మరపురాని నీ ప్రేమను నే స్మరింతునులే నా దేవుండా
కరుణచూపి వధువు కొరకే తనువు దానంబు చేసితివి

ఈ జగతిని నీవె సృష్ఠించి ఈ జగతిని నీవె పోషించి
కరుణ జూపి కాపాడితిడితివి ||2||
సర్వము నెత్తి స్తుతించెదను

అశాశ్వతమైన బ్రతుకునకు నీ శాశ్వత జీవమిచ్చితివి
మృత్యుంజయుడా విమోచకుడా ||2||
మోక్షరాజ్యాధి పాలకుడా

శ్రమలెన్నో నను చ్టుి క్రమము తప్పించి బాధింపన్
శ్రమలు నాలో భరించుచునే ||2||
శాంతి సౌఖ్యాలు కలిగెనులే

నా ఎముకలలోని ఒక ఎముక నా మాంసములోని మాంసమును
నరుని నుండి తీయబడిన ||2||
నారీమణులే నా మకుటములే

మహోన్నతమైన దేవుండా మహోన్నత రాజ్యపాలకుడా
మహా ఘనతా ప్రభావములు ||2||
నీకే కలుగున్ హల్లేలూయా

ఒకే దేహంబుగా నుండెన్ ఒకే భావంబుగా నుండెన్
ఒకే నీతిన్ ఒకే ఖ్యాతిన్ ||2||
ఈ ధాత్రిన్ జ్యోతి వెలుగింపన్

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...