నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మది నిచ్చెను
కృపాశక్తి దయాసత్య సంపూర్ణు
వాక్యమై యున్న యేసు వందనమయ్యా
జిగటగల యూబి నుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్నునిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నడుపుచుండెను
నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా (2)
నీవు పలికితే నాకు మేలయ్యా (2)
నీ దర్శనమే నాకు చాలయ్యా (2) ||నాతో||
నీ వాక్యమే నన్ను బ్రతికించేది
నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు||
నీ వాక్యమే స్వస్థత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది (2) ||నీవు ||
నీ వాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో వెలుతురునిచ్చేది (2) ||నీవు ||
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది
మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు
మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు
ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలియించనా
జీవజలముల ఊటయైన నీ ఓరను నను నాటితివా
వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా
వాగ్ధాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా
నీటి యూట యొద్ద నాటబడితిమి
వేరు తన్ని ఎదిగి ఫలియింతుము
చింతపడము మా కాపు మానము
యేసు కృప చాలును||2||
యేసు కృప చాలును II నీటిII
పాపం పోయెను - హల్లెలూయా
యేసు లేచెను - హల్లెలూయా
యేసు వచ్చును హల్లెలూయా
స్తుతిగీతం పాడుదమ ||2||
స్తుతిగీతం పాడుదమ II నీటిII
యేసే మార్గము – హల్లెలూయా
యేసే సత్యము - హల్లెలూయా
యేసే జీవము - హల్లెలూయా
యేసు వార్తను చాటుదమ ||2||
యేసు వార్తను చాటుదమ II నీటిII
వాక్య ధ్యానంతో - హల్లెలూయా
ప్రార్ధనాత్మతో - హల్లెలూయా
ఏకత్వముతో - హల్లెలూయా
సహవాసము కోరుదమ ||2||
సహవాసము కోరుదమ II నీటిII
నిన్న నేడు నిరంతరం మారనే మారవు
నా జ్ఞాపకాలలో చెరగని వాడవు
నీవే నీవే నమ్మదగిన దేవుడవు
నీవు నా పక్షమై నిలిచే యున్నావు II నిన్నII
యేసయ్యా నీ ప్రత్యక్షతలో
బయలు పడెనే శాశ్వతకృప నాకై
విడువదే నన్నెల్లపడూ కృప
విజయపధమున నడిపించెనే కృప
విస్తరించెనే నిన్ను స్తుతించినపుడు II నిన్నII
యేసయ్యా నీ కృపాతిశయము
ఆదరించెనే శాశ్వత జీవమకై
మరువదే నన్నెల్లప్పుడూ కృప
మాణిక్య మణులను మరిపించెనే కృప
మైమరచితినే నీ కృప తలంచినపుడు II నిన్నII
యేసయ్యా నీ మహిమైశ్వర్యము
చూపెనే నీ దీర్ఘశాంతము నాపై
ఆదుకొనె నన్నెల్లప్పుడూ కృప
శాంతి సమరము చేసెనే కృప
మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే II నిన్నII
నీ కృప నిత్యముండును
నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము (2) ||నీ కృప||
శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
కృంగిన వేళలో నను లేవనెత్తిన
చిరునామా నీవేగా (2) ||నీ కృప||
ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు
కనుమరుగైపోయెనే (2) ||నీ కృప||
అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)
రాజమార్గములో నను నడుపుచున్న
రారాజువు నీవేగా (2) ||నీ కృప||
శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత||
నా హృదయమెంతో జీవముగల దేవుని
దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)
నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత||
భక్తిహీనులతో నివసించుటకంటెను
నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)
వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2) ||శాశ్వత||
సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2)
సీయోను రారాజువు నీవేగా (2) ||శాశ్వత||
నూతనమైన ఈ జీవ మార్గమందున
నూతన జీవము ఆత్మాభిషేకమే (2)
నూతన సృష్టిగా నన్ను మార్చెను (2) ||శాశ్వత||
దూతలు చేయని నీ దివ్య సేవను
ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)
ధూపార్తిని చేపట్టి చేసెద (2) ||శాశ్వత||