నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు
నీ సన్నిధి కల్గియున్న ఆ నరుడే ధన్యుడు
పాపములను పడగొట్టును - నీ పాదసన్నిధి
శాపములను హరియించును - శక్తి కలిగిన సన్నిధి
చిక్కులను విడగొట్టును - నీ పాదసన్నిధి
చింతలను తీర్చునది - చిత్రమైన సన్నిధి
వ్యాధులను పోగొట్టును - నీ పాదసన్నిధి
బాధలను బాపితుదకు - మోదమిచ్చు సన్నిధి
ఋణములను రద్దుపరచు - నీ పాదసన్నిధి
రణములను మాన్పునది - రమ్యమైన సన్నిధి
పడకుండ చేయునది - నీ పాదసన్నిధి
నిరతంబు నడిపించునది - నీ దివ్యసన్నిధి
మచ్చలను మాన్పునది - నీ పాదసన్నిధి
ముడతలను సరిచేయును - ముచ్చటైన సన్నిధి
అపవాది తంత్రములను - లయపరచు నీ సన్నిధి
పాతాళ బంధకములను - త్రెంచివేయు నీ సన్నిధి
ఆరోహణ బలమిచ్చును - నీ పాదసన్నిధి
అవరోహణ అంతస్థును - అందించు నీ సన్నిధి
పాపనైజము మార్చును - శ్రీయేసుని సన్నిధి
అసాధ్యమైన కార్యములను - సరిచేయు నీ సన్నిధి
అల్పయు ఓమేగయు నైన - ఆ యేసుని సన్నిధి
ముఖాముఖిగ మాట్లాడును - ఆశ్చర్య సన్నిధి