Wednesday, 24 August 2016

241. Sudhamadhura Kiranala Arunodayam

సుధామధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణమరుణోదయం
తెరమరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది

1. దివిరాజుగా భువికి దిగినాడని
రవిరాజుగా ఇలలో మిగిలాడని
నవలోక గగనాలు తెరిచాడని
పరలోక భువనాలు పిలిచాడని
తీరని జీవన జ్యోతిగ వెలిగే తారొకొటొచ్చింది
పాడె పాటలు పశువుల శాలను ఊయల చేసింది
జన్మమే ఒక మర్మము బంధమే అనుబంధము

2. లోకాలలో పాప శోకాలలో
ఏకాకిలా బ్రతుకు అవివేకులు
క్షమ హృదయ సహనాలు సమపాలుగా
ప్రేమానురాగాలు స్థిర ఆస్థిగ
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడాయేసే
నిత్యసుఖాల జీవజలాల పెన్నిధి ప్రభువే
నిను కావగా నిరుపేదగా జన్మించెగా ఇల పండుగా

240. Sri Yesundu Janminche Reyilo

శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లెహేము ఊరిలో

1. కన్నియ మరియమ్మ గర్భమందున
ఇమ్మానుయేలనెడి నామమందున

2. సత్రమందున పశువుల శాలయందున
దేవపుత్రుండు మనుజుండాయెనందున

3. వట్టి పొత్తిగుడ్డలతో చుట్టబడి
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి

4. గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా
దెల్పె గొప్పవార్త దూత చల్లగా

5. మన కొరకొక్క శిశువు పుట్టెను
ధరను మన దోషముల బోగొట్టెను

6. పరలోకపు సైన్యంబు గూడెను
మింట వర రక్షకుని గూర్చి పాడెను

7. అక్షయుండగు యేసు పుట్టెను
మనకు రక్షణంబు సిద్ధపరచెను

239. Laali Laali Laalamma Laali (Christmas Song)

లాలి లాలి-లాలమ్మ లాలి - లాలి- లాలి
శ్రీమరియమ్మ పుత్ర నీకే లాలి

బెత్లేహేము పుర వాస్తవ్యలాలి భూలోక
వాస్తవ్యులు చేయు స్తుతులివిగో లాలి

పశుల తొట్టె - నీకు పాన్పాయెను లాలి
ఇపుడు పాపులమైన - మా
హృదయములలో పవళించుము

పొత్తి వస్త్రములే నీకు-పొదుపాయెను లాలి
మాకు మహిమ - వస్త్రము లియ్యను
నీవు మహిలో పుట్టితివా

పశువుల పాకే - నీకు వసతి గృహమాయె
మాకు మహిమ - సౌధము లియ్యను
నీవు మనుష్యుడవైతివా

తండ్రి కుమార - పరిశుద్ధాత్మలకే స్తోత్రం  
ఈ నరలోకమునకు - వేం చేసిన
శ్రీ బాలునకే సోత్రం

238. Yesuraju Yeseraju Yesuraju (Christamas Song)

యేసురాజు యేసేరాజు యేసురాజు
ఈసా ప్రజాపతి క్రీస్తేరాజు

రాకరాక వచ్చినాడు యేసురాజు
రాకరాక వచ్చినాడు క్రీస్తురాజు

లేకలేక కల్గినాడు యేసురాజు
లోకమునకు కల్గినాడు క్రీస్తేరాజు

గొల్లలకు కాన్పించె యేసురాజు
ఎల్లరకు కాన్పించె క్రీస్తేరాజు

జ్ఞానులకు కాన్పించె యేసురాజు
ఆ! జ్ఞానులకు కాన్పించె క్రీస్తురాజు

గగనమందు ఘనతనొందె యేసురాజు
జగతియందు ఘనత నొందె క్రీస్తురాజు

గౌతముని ప్రవచనము యేసేరాజు
భూతలమున గురువు రాజు క్రీస్తేరాజు

మొదట యహోదీయులకు యేసేరాజు
పిదప మనందరకు క్రీస్తేరాజు

హల్లెలూయ - హల్లెలూయ యేసేరాజు
హల్లెలూయ హల్లెలూయ క్రీస్తేరాజు

237. Yesu Baluda Yesu Baluda (Christmas Song)

యేసు బాలుడ - యేసు బాలుడ
ఎంతయు వందనం - ఓ భాసుర
దేవకుమార - భక్తి వందనం
ఓ భాసుర దేవకుమార - భక్తి వందనం

పసుల తొట్టెలోనే యప్పుడు
పండినావు ఇప్పుడు - వసుధ భక్తు
లందరిలోను - వాసము జేతువు

యూదులలోనే యావేళ - ఉద్భవించితివి
యిప్పుడు = యూదాది
సకల జనులలో - ఉద్భవింతువు

236. Yesu Janminchen Ilalo

యేసు జన్మించెన్ ఇలలో- యేసు జన్మించెన్
పాపుల కొరకును శుద్ధుల కొరకును = యేసు
జన్మించెన్ - ఈ సంతసమగు వర్తమానము
ఎల్లజనుల వీనులమ్రోగు గాక విభునకు స్తోత్రము

లోకము కొరకునును నాకై నీకై - ఆ కాలమునకై
ఈ కాలమునకై లోక రక్షకుడగు యేసుడు బుట్టెను
ఆకైసరౌగుస్తు అరయలేదు ప్రభున్ = ఇది
ఆశ్చర్యము - ఎంతో విచారము ఏల నతు
ప్రభు - నెరుగక పోయెనో

భూజనాంగములకై నాకై నీకై - రాజులకై హే - రోదు
రాజు కొరకై - రాజగు యేసుడు రంజిల్లు
బుట్టెను - రాజగు హేరోదు ప్రభువు
నరయలేదు = ఇది ఆశ్చర్యము - ఎంతో
విచారము - యేల నతు ప్రభు నెరుగక పోయెనో

సర్వలోకమునకై నాకై నీకై - సర్వ వేదజ్ఞులౌ
శాస్త్రుల కొరకై ఉర్విని - యేసుడు - ఉద్భవించెను
గర్వపు శాస్త్రులు ప్రభువు నరయలేదు = ఇది
ఆశ్చర్యము - ఎంతో విచారము - యేల వారు
ప్రభు - నెరుగక పోయిరో

నీవనుకొను ప్రతివానికై నాకై నీకై - దేవార్చకులకై
శాస్త్రుల కొరకై - దేవ నందనుడు భువిలో - బుట్టెను
ఈ వార్త చూసి వారు ప్రభుని పూజింప లేదు
ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము
యేల వారు ప్రభు - నెరుగక పోయిరో

ఆ ప్రాంతపు వారికి జ్ఞానులకు - ఈ ప్రభు జన్మ
సు - వార్త విన బడియె - భూ ప్రజలీ వార్త
గ్రహియింప లేదాయె - ఆ ప్రజలకు చూచు
నాశయె లేదాయె = ఇది ఆశ్చర్యము - ఎంతో
విచారము - ఎందులకీ వార్త - యెరుగక పోయిరో

సకల మతస్థుల కొరకై నాకై - సుఖముగా జీవించ
నీ కొరకై ప్రభు - సుఖమును త్యజియించి - సుతుడై
పుట్టెను - సకల మతస్థులు - స్వామి నెరుగలేదు
ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము -యేల
వారు ప్రభు - నెరుగక పోయిరో

అన్ని పల్లెలకై పట్టణములకై - కన్న బిడ్డలమగు
నాకై నీకై - చిన్నకుమారుడై - శ్రీ యేసు బుట్టెను
అన్ని చోట్లకిపుడు - వార్త తెలియు చుండెన్ = ఇది
ఆశ్చర్యము - ఎంతో సంతోషము - ఇట్లు వ్యాపింప
జేయు - దేవునికి స్తోత్రము

235. Ma Korakai ee Buviyandu

మా కొరకై ఈ భువియందు జన్మించినావు ఓ క్రీస్తు
బెత్లెహేములో పశులపాకలో మరియ ఒడిలో ఓ తనయుడ

ఏ మంచి మాలో లేకున్నవేళ దివినుండి వచ్చితివి
చీకటిలో ఉన్న మమ్మును చూసి నీ వెలుగును ఇచ్చితివి
ఎంత జాలిని చూపించినావు నీకే వందనము
హ్యాపి హ్యాపి క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్
వి విష్యు ఏ మెర్రి క్రిస్మస్

మా శిక్షను భరియించుటకై ఈ భువిలో జన్మించినావు
ఏమిచ్చినా నీ ఋణమును నేను తీర్చలేనయ్యా
ఎంత ప్రేమను చూపించినావు నీకే వందనము
హ్యాపి హ్యాపి క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్
వి విష్యు ఏ మెర్రి క్రిస్మస్

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...