Monday, 20 November 2017

286. Banda Sanduna Pavurama

బండసందున పావురమా - పేటుబీటుల పావురమా
ప్రియుడు నిన్ను కోరినాడు - భీతి చెందకుమా
వరుడు నిన్ను కోరినాడు - కలత చెందకుమా

సిద్ధపడుమా ఓ సంఘమా
క్రీస్తు వచ్చు వేళాయె వేచియుండుమా
యేసు వచ్చు వేళాయె వేచియుండుమా

ప్రియుడు నిన్ను కోరెను - నీ వరుడు నిన్ను కోరెను
నీ స్వరము వినిపించుమా - నీ ముఖము చూపించుమా
యేసురాజు దిగువచ్చు వేళ ||2||
నీవు సంసిద్ధమా - నీవు పరిశుద్ధమా            
||సిద్ధ||

కొండ పేటులందున - బండ బీటులందున
నీ గూడు నిర్మింపుమా - నీ ప్రియునికై చూడుమా
లోక ఆశలు నీకేలనమ్మా ||2||
సిద్దె వెలిగించుమా - సిద్ధముగ నుండుమా    
||సిద్ధ||

సాగరాలు పొంగినా - నింగి నేలకొరిగినా
భయమేల ఓ సంఘమా - దిగులేల ఓ సంఘమా
బండక్రీస్తే నీ అండనుండ ||2||
గీతములు పాడుమా - నీ ప్రియుని వీక్షింపుమా 
||సిద్ధ||

ద్రాక్షచెట్టు పూతపట్టి - వాసనలిచ్చుచున్నవి
చలికాలమే గడిచెనమ్మా - నిదురేల నీకింకలెమ్మా
వరుడు యేసు దిగివచ్చు వేళ ||2||
తరుణ మేతెంచెనమ్మా - నీ ప్రియుని సంధించుమా 
||సిద్ధ||

Wednesday, 15 November 2017

285. Nee Mandiramai Nenundaga Nayandundi Nadipinchava

నీ మందిరమై నేనుండగా - నాయందుండి నడిపించవా
నీవు తోడుండగా మాకు దిగులుండునా
వెంబడిస్తాము నిను యేసువా

నీవు కోరేటి దేవాలయం - మాదు దేహంబెగా నిశ్చయం
నీ ప్రత్యక్షతా మాకు కలిగించవా
మా హృదయంబు వెలిగించవా

హన్న ప్రార్ధనలు విన్నావుగా - నేనున్నానని అన్నావుగా
నాడు సమూయేలుతో బహుగ మాట్లాడిన
దేవమందిరమిదె మాట్లాడవా

ఆత్మ సత్యముతో ఆరాధింప
ఆత్మ దేవుండా నేర్పించుమా
సత్యమార్గంబులో మమ్ము నడిపించవా
నిత్యము నిన్ను స్తుతియింతుము

నాడు నిర్మించె దేవాలయం
రాజు సొలొమోను బహుసుందరం
అట్టి దేవాలయము మేము నిర్మించగా
నీ కట్టడలో మమ నిలుపవా

ఆ పరలోక ప్రతిబింబమై - ఈ ధరలోన దేదీప్యమై
ధరణి వెలిగించిన కరుణ ప్రసరింపను
కరము తోడుంచి నడిపించుము

284. Kristhava Sanghama Ghana Karyamulu Cheyu Kalamu

క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా
క్రీస్తుప్రభువు నీ క్రియల మూలంబుగ కీర్తి పొందునని తెలుసునా
కీడు నోడింతువు తెలుసునా కిటుకు విడగొట్టుదువు తెలుసునా

1.            పరమధర్మంబులు భాషలన్నియందు ప్రచురింతువని నీకు తెలుసునా
               నరుల రక్షకుడొక్క నజరేతుయేసని నచ్చచెప్పుదువని తెలుసునా
               నడిపింతువని నీకు తెలుసునా నాధుని జూపింతువు తెలుసునా

2.            లెక్కకు మించిన రొక్కము నీచేత చిక్కియుండునని తెలుసునా
               ఎక్కడికైనను ఎగిరివెళ్ళి పనులు చక్కబెట్టుదువని తెలుసునా
               చక్కపరతువని తెలుసునా సఫలపరతువని తెలుసునా

3.            యేసుని విషయాలు ఎరుగని మానవులు ఎచట నుండరని తెలుసునా
               యేసులో చేరని ఎందరో యుందురు ఇదియు కూడ నీకు తెలుసునా
               ఇదియే నా దుఃఖము తెలుసునా ఇదియే నీ దఃఖము తెలుసునా

4.            నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువని తెలుసునా
               అన్ని ఆటంకములు అవలీలగా దాటి ఆవలకు చేరెదవు తెలుసునా
               అడ్డురారెవరును తెలుసునా హాయిగనందువు తెలుసునా

5.            నీ తండ్రియాజ్ఞలన్నిని పూర్తిగ నీవు నెరవేర్తువని నీకు తెలుసునా
               పాతాళము నీ బలము ఎదుట నిలువబడనేరదని నీకు తెలుసునా
               భయపడునని నీకు తెలుసునా పడిపోవునని నీకు తెలుసునా

6.            ఒక్కడవని నీవు ఒడలిపోవద్దు నీ ప్రక్కననేకులు తెలుసునా
               చిక్కవు నీవెవరి చేతిలోనైనను చిక్కిపోవని నీకు తెలుసునా
               నొక్కబడవని నీకు తెలుసునా సృక్తిపోవని నీకు తెలుసునా

7.            నేటి అపజయములు నేటి కష్టంబులు కాటిపాలైపోవున్తెలుసునా
               బూటకపు బోధకులు బోయి పర్వతాల చాటున దాగెదరు తెలుసునా
            చాటింపకుందురు తెలుసునా గోటు చేయలేరు తెలుసునా

283. O Sanghama Sarvangama Paraloka Rajyapu

ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా
యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా
ఓ సంఘమా వినుమా

రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో
వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో
ఆనంద తైల సుగంధాభిషేకము (2)
పొందితివా యేసునందు (2)       ||ఓ సంఘమా||

క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణాలర్పించెనని
స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ
మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2)
సహియింతువా తీర్పునాడు (2)       ||ఓ సంఘమా||

చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు
శ్రీకర్త గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని
గుర్తించుచుంటివా క్రియలను గంటివా (2)
సజీవముగా నున్నావా (2)       ||ఓ సంఘమా||

చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగును
నులివెచ్చని స్థితి నీకుంటే – బయటకు ఉమ్మబడెదవేమో
నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో (2)
ఆసక్తితోడ రక్షణ నొందుమా (2)       ||ఓ సంఘమా||

282. Alayamlo Pravesinchandi Andaru

ఆలయంలో ప్రవేశించండి అందరు
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం 

దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదికే వారికంతా కనబడు దీపము
యేసు రాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికమై
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమానందం హల్లెలూయా 

ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరెదం పొందెదం
ఆనందమానందం హల్లెలూయా 

281. Sakthi Chetha kadanenu Balamuthonidi Kadanenu

శక్తిచేత కాదనెను - బలముతోనిది కాదనెను     ||2||
నా ఆత్మద్వారా దీనిచేతునని యెహోవా సెలవిచ్చెను       ||2||

 1.           గొప్ప పర్వతమా - జెరుబ్బాబెలు నడ్డగింపను
               ఎంతమాత్రపు దానవు నీవనెను - చదును భూమిగ మారెదవు

 2.           ఇశ్రాయేలు విను - నీ భాగ్యమెంత గొప్పది
               యెహోవా రక్షించిన నిన్ను - బోలిన వారెవరు

280. Yesayya Na Hrudayabhilasha Nivenayya

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తియ్యని తలంపులు నీవేనయ్యా

పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై
నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు
పూజనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నా కనుల మెదలుచున్నవాడా   ||యేసయ్యా||

ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా
విజయశీలుడా పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలచియున్నవాడా      ||యేసయ్యా||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...